బీఆర్‌ఎస్‌ది.. రైతులకు బేడీలు వేయించిన చరిత్ర | - | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ది.. రైతులకు బేడీలు వేయించిన చరిత్ర

May 22 2026 4:46 AM | Updated on May 22 2026 4:46 AM

నల్లగొండ : రైతులకు బేడీలు వేయింని చరిత్ర బీఆర్‌ఎస్‌ పార్టీదని డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్‌ అన్నారు. గురువారం రాజీవ్‌గాంధీ వర్థంతి సందర్భంగా నల్లగొండలో రాజీవ్‌ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 10 సంవత్సరాల పాలనలో కేసీఆర్‌, వారి చెంచాలు రైతులకు ద్రోహం చేసి వారి ఖజానా నింపుకున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ పాలనలో సుమారు పదివేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. ఖమ్మంలో మిర్చి రైతులకు బేడీలు వేయించిన సంఘటనలు ప్రజలు మర్చిపోలేదన్నారు. కలెక్టరేట్‌ వద్ద బీఆర్‌ఎస్‌ సభను చూస్తే రైతు హంతకుల సభను తలపించిందన్నారు. జిల్లాలో ఇప్పటికే 75 శాతం ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయని ఈనెల 25వ తేదీ లోపు వంద శాతం పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు యాల రవీందర్‌రెడ్డి, బోడ స్వామి, పగిళ్ల రాజు, చర్లపల్లి గౌతమ్‌, మధగోని వెంకన్న, వావిళ్ల దేవదాస్‌, నాగరాజు, పొట్ట మధు, శరత్‌, వినీత్‌, సచిన్‌ పాల్గొన్నారు.

ఫ డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్‌

Advertisement
 
Advertisement
Advertisement