నల్లగొండ : ధాన్యం కొనుగోలు ప్రక్రియలో భాగంగా రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని ఉదయాదిత్య భవన్‌లో డీఆర్‌డీఏ, ఐకేపీ, పీఏసీఎస్ ఏజెన్సీల ప్రతినిధులు, ట్యాబ్ ఆపరేటర్లు, ఏపీఎంలు, పీఏసీఎస్ సీఈఓలు, మండల వ్యవసాయ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ పూర్తిచేసి రైతుల ఖాతాల్లో నగదు జమ అయ్యేలా చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, డీసీఓ పత్యనాయక్, పౌరసరఫరాల అధికారి వెంకటేష్ పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ చంద్రశేఖర్


