ఆస్తి పన్ను సర్వర్‌ డౌన్‌ | - | Sakshi
Sakshi News home page

ఆస్తి పన్ను సర్వర్‌ డౌన్‌

May 20 2026 11:25 AM | Updated on May 20 2026 11:25 AM

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోతా

ఆస్తి పన్ను సర్వర్‌ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటా. ఐదు శాతం రాయితీ తరువాత అప్‌డేట్‌ చేయాల్సి ఉంటుంది. అందువల్లే సర్వర్‌ సమస్య ఏర్పడినట్లు తెలిసింది.

– బి.శరత్‌చంద్ర,

మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌

నల్లగొండ టూటౌన్‌ : మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లో ఆస్తి పన్ను సర్వర్‌ పని చేయడంలేదు. నీలగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ తో పాటు మిర్యాలగూడ, హాలియా, నందికొండ, దేవరకొండ, చండూరు, చిట్యాల, నకిరేకల్‌ మున్సిపాలిటీల్లో 13 రోజులుగా ఆస్తి పన్ను సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. పట్టణాలకు చెందిన వారు పలువురు కార్యాలయాలకు వచ్చి ఆస్తి పన్ను చెల్లించేందుకు వస్తుండడంతో సర్వర్‌ పని చేయడంలేదని మున్సిపల్‌ సిబ్బంది చెబుతున్నారు. దాంతో భవనాల యాజమానులు ఆస్తి పన్ను చెల్లించే అవకాశం లేక వెనుదిరిగిపోతున్నారు. వార్డు ఆఫీసర్లు డివిజన్లు, వార్డుల్లో తిరుగుతున్నా కొందరు మాత్రం మున్సిపల్‌ కార్యాలయాలకు వచ్చి ఆస్తి పన్ను చెల్లించి రశీదు పొందుతుంటారు. ఆస్తి పన్ను సర్వర్‌ పని చేయని కారణంగా కార్యాయాలకు వచ్చి ఆస్తి పన్ను చెల్లించాలనుకునే వారికి ఇబ్బందులు తప్పడంలేదు. వార్డు ఆఫీసర్ల దగ్గర ఉన్న మిషన్లు కూడా పని చేయకపోవడంతో గత 13 రోజుల నుంచి ఆస్తి పన్ను సేవలు నిలిచిపోయాయి.

సీడీఎంఏలోనే సర్వర్‌ సమస్య..

హైదరాబాద్‌లోని సీడీఎంఏ కార్యాలయంలోనే ఆస్తి పన్ను సర్వర్‌ సమస్య నెలకొంది. అసలు సమస్య ఎందుకు వచ్చిందనే సమాచారం మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లకు ఇవ్వకపోవడం లేదు. ఆస్తి పన్ను సర్వర్‌ పని చేయని కారణంగా మే నెలలో ఆస్తి పన్ను వసూలయ్యే అవకాశం లేకుండా పోయింది. ఆస్తి పన్ను సర్వర్‌ ఎప్పుడు వస్తుందనే సమాచారం మున్సిపాలిటీ అధికారులకు లేకపోవడంతో వారు చేసేదేమీ లేక మిన్నకుండిపోతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి సర్వర్‌ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది.

ఫ 13 రోజులుగా నిలిచిన సేవలు

ఫ మన్సిపాలిటీలు, కార్పొరేషన్‌లో నిలిచిన పన్ను వసూళ్లు

Advertisement
 
Advertisement
Advertisement