ఫ ప్రభుత్వానికి విత్తనాభివృద్ధి సంస్థ ప్రతిపాదనలు
ఫ నెలాఖరు నాటికి అందుబాటులోకి విత్తనాలు
నల్లగొండ అగ్రికల్చర్ : వానాకాలం సీజన్‌కు అవసరమైన వరి, పెసర, జీలుగ, జనుము విత్తనాలను రైతులకు అందించటానికి నందిపాడ్ విత్తనాభివృద్ధి సంస్థ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. జిల్లా వ్యాప్తంగా వానాకాలం సీజన్‌లో 2,815 క్వింటాళ్ల వరి, పెసర, జీలుగ, జనుము విత్తనాల అవసరం ఉంటాయని అంచనా వేసి ప్రభుత్వానికి పంపింది. రైతులకు అవసరమైన వరి విత్తనాలను నెలాఖరు నాటికి అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా వానాకాలం సీజన్‌లో 12,02,051 ఎకరాల్లో వరి, పత్తితో పాటు వివిద పంటలు సాగు కానున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అందుకు అవసరమైన వరి జేజీఎల్ 27356 రకం 133 క్వింటాళ్లు, ఎంటీయు 1010 రకం 983.75 క్వింటాళ్లు, కేఎన్‌ఎం 118 రకం 879 క్వింటాళ్లు, జేజీఎల్ 24423 రకం 369.50 క్వింటాళ్లు, బీపీటీ 5204 రకం 246 క్వింటాళ్లు, పెసర ఎంజీజీ 385 రకం 34 క్వింటాళ్లు, జీలుగ 114.60 క్వింటాళ్లు, జనుము 51.20 క్వింటాళ్లు అవసరంగా గుర్తించింది.
జీలు, జనుము
50 శాతం సబ్సిడీపై..
జీలుగ, జనుము విత్తనాలు 50 శాతం సబ్సిడీపై రైతులకు అందించనున్నారు. వరి, పెసర విత్తనాలపై ఎలాంటి సబ్సిడీ ఉండదు. జిల్లా వ్యాప్తంగా అవసరమైన పత్తి విత్తనాలు సుమారు 16 లక్షల ప్యాకెట్లు ప్రైవేట్ వ్యాపారుల వద్ద అందుబాటులో ఉన్నాయి. పత్తితో పాటు ఇతర హైబ్రీడ్ వరి విత్తనాలు కూడా ప్రైవేట్ వ్యాపారుల వద్ద అందుబాటులో ఉన్నాయి. విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా సరఫరా చేసే విత్తనాలను త్వరలో ప్రాథమిక సహకార సంఘాలు, ఆగ్రోస్ రైతు సేవా సంస్థల్లో రైతులకు అందుబాటులో ఉంచనున్నారు.
వానాకాలం సాగు అంచనా ఇలా..
పంట ఎకరాల్లో
పత్తి 5,13,524
వరి 5,86,137
కంది 14,000
సజ్జ 200
జొన్న 500
మొక్కజొన్న 500
ఆముదం 500
పెసర 7,000
వేరుశెనగ 5,000


