నల్లగొండ : విద్యార్థులు చదువుతో పాటు చేతివృత్తులపై అభిరుచి పెంచుకోవాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా శనివారం నల్లగొండలోని డైట్ కాలేజీ ఆవరణలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆర్ట్స్, క్రాఫ్ట్, కల్చర్ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచి పాఠశాల విద్యార్థులకు అల్పాహారాన్ని అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒకేచోట 2500 మంది విద్యార్థులు చదువుకునే విధంగా రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో డీఈఓ భిక్షపతి, సైన్స్ అధికారి, ఎంఈఓలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఓటర్ మ్యాపింగ్ పూర్తిచేయాలి
నల్లగొండ : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) కార్యక్రమంలో భాగంగా ఓటరు మ్యాపింగ్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి.చంద్రశేఖర్ ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో నల్లగొండ కలెక్టరేట్ నుంచి పాల్గొన్న అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడారు. సర్ షెడ్యూల్ మొదలయ్యేలోగా ఓటరు మ్యాపింగ్ పూర్తి చేయాలన్నారు. సాదాబైనామ ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. భూ భారతి దరఖాస్తులు పెండింగ్‌లో లేకుండా చూడాలన్నారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, ఆర్డీఓలు అశోక్‌రెడ్డి, రమణారెడ్డి, శ్రీదేవి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ చంద్రశేఖర్


