ధాన్యం దిగుమతి వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

ధాన్యం దిగుమతి వేగవంతం చేయాలి

May 17 2026 7:20 AM | Updated on May 17 2026 7:20 AM

మిర్యాలగూడ : కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని మిల్లర్లు జాప్యం చేయకుండా దిగుమతి చేయాలని కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ ఆదేశించారు. శనివారం మిర్యాలగూడలోని సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో రైస్‌ మిల్లర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ శరత్‌చంద్రపవార్‌తో కలిసి కలెక్టర్‌ మాట్లాడారు. ధాన్యాన్ని ఎప్పటికప్పుడు అన్‌లోడింగ్‌ చేయాలని, హమాలీల కొరత లేకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. రోజూ కనీసం 400 లారీల ధాన్యం మిల్లుల్లో దించేలా చూడాలన్నారు. ధాన్యం అన్‌లోడింగ్‌ అయిన వెంటనే ట్రక్‌ షీట్లను తీసుకెళ్లాలని తెలిపారు. రైస్‌ మిల్లులు, లారీ ట్యాగింగ్‌ సమస్యలు ఉంటే అధికారులు వెంటనే పరిష్కరించాలన్నారు. మిర్యాలగూడ లారీ అసోసియేషన్‌ అదనంగా 50 లారీలను అందుబాటులో ఉంచాలని, ధాన్యం తరలింపు పూర్తయ్యే వరకు సహకరించాలని ఆదేశించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ జె.శ్రీనివాస్‌, ఆర్డీఓ రమణారెడ్డి, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వెంకటేష్‌, మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్‌రాజు, పౌరసరసరఫరాల డీఎం రాంపతినాయక్‌, తహసీల్దార్‌ శ్రీనివాస్‌, మిల్లర్లు గౌరు శ్రీనివాస్‌, బాబి, నవీన్‌, శ్రీరాం తదితరులు పాల్గొన్నారు.

ఫ కలెక్టర్‌ చంద్రశేఖర్‌

Advertisement
 
Advertisement
Advertisement