నల్లగొండ టౌన్ : నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో (జీజీహెచ్) మంగళవారం అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీహెచ్‌ఎస్ డాక్టర్ మాతృ ఫ్లోరెన్స్ నైటింగేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి నర్సులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సులు అందించే సేవలను విస్త్రతం చేసి రోగుల ప్రాణాలు కాపాడాలని అన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నగేష్, ఆర్‌ఎంఓ చంద్రశేఖర్, నర్సింగ్ సూపరింటెండెంట్లు నీలాబాయి, సుజాత, రేణుకా దేవి తదితరులు పాల్గొన్నారు.


