నీలగిరిని మరింత అభివృద్ధి చేస్తా
నల్లగొండ : నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్‌కు అధిక నిధులు తీసుకొచ్చి మరింత అభివృద్ధి చేస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటో గ్రఫీ శాఖామంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్‌లో పోటీచేసే పలువురి అభ్యర్థుల పేర్లను మంత్రి ప్రకటించారు. కార్పొరేషన్‌లోని 6వ డివిజన్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టి 25, 41, 19 డివిజన్‌లో నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. పట్టణంలో ట్రాక్టర్ నడిపి పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో నల్లగొండలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలన్నారు. కార్పొరేషన్‌లోని 48 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. నల్లగొండ మున్సిపాలిటీని అభివృద్ద్ధి చేసింది తానేనని.. ఇంకా చేసేదీ తానేనని స్పష్టం చేశారు. పేదలకు ఏ ఆపద వచ్చినా అండగా ఉంటానన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ చేసింది శూన్యమని, ఆ పార్టీని ప్రజలు ఎప్పుడో బొంద పెట్టారని ఎద్దేవా చేశారు. నల్లగొండ కార్పొరేషన్‌లో రూ.2,200 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ ఎంఏ.హఫీజ్‌ఖాన్, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్‌గౌడ్, తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ పాశం రాంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, డీసీసీబీ మాజీ డైరెక్టర్ పాశం సంపత్‌రెడ్డి, నాయకులు జూలకంటి శ్రీనివాస్, కర్నాటి కరుణాకర్‌రెడ్డి, కేసాని వేణుగోపాల్‌రెడ్డి, గోగుల గణేష్, లోకేశ్వరిరెడ్డి, కత్తుల వెంకట్, విక్రంరెడ్డి, అన్వర్, ఎండీ.హఫీజ్, మేడోజు శ్రీనివాస్, జగాల్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి


