షోరోమ్‌లోనే వాహన రిజిస్ట్రేషన్‌ | - | Sakshi
Sakshi News home page

షోరోమ్‌లోనే వాహన రిజిస్ట్రేషన్‌

Jan 26 2026 6:37 AM | Updated on Jan 26 2026 6:37 AM

షోరోమ

షోరోమ్‌లోనే వాహన రిజిస్ట్రేషన్‌

కొనుగోలుదారులకు మంచి అవకాశం

వాహన కొనుగోలుదారులకు సేవలు సులభతరం చేసేందుకు రవాణా శాఖ నూతన విధానాన్ని అమలుచేస్తోంది. ఇక నుంచి ఆర్టీఓ కార్యాలయానికి రాకుండానే టూవీలర్స్‌, కార్ల కొనుగోలుదారులు వాహనాలు కొన్న డీలర్‌ పాయింట్‌ వద్దే పర్మినెంట్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. కొత్తవాహన కొనుగోలుదారులకు ఇది చాలా మంచి అవకాశం.

– వాణి, డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌

నల్లగొండ : వాహనాల రిజిస్ట్రేషన్ల విషయంలో ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చింది. కొనుగోలుదారులకు సేవలను సులభతరం చేసేందుకు వాహనాలు కొన్న చోటే పర్మినెంట్‌ రిజిస్ట్రేషన్‌ చేసే విధానానికి శ్రీకారం చుట్టింది. నూతనంగా వాహనాలు కొనుగోలు చేసినవారు ఆర్టీఓ కార్యాలయానికి రాకుండానే వాహనాల రిజిస్ట్రేషన్లు కానున్నాయి. ఎక్కడైతే వాహనాలు కొంటారో ఆ డీలర్‌ పాయింట్‌ (షో రూమ్‌) వద్దే పర్మినెంట్‌ రిజిస్ట్రేషన్‌ కానుంది. ఇందుకు వాహనాల కొనుగోలుదారులు అవసరమైన డాక్యుమెంట్లను సమర్పిస్తే డీలరే ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేస్తాడు. సాయంత్రంలోగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తికానుంది. దీంతో రిజిస్ట్రేషన్‌ సేవలు సులభం కావడంతో వాహన కొనుగోలుదారుడు రిజిస్ట్రేషన్‌ కోసం కార్యాలయాల చుట్టూతిరగాల్సిన అవసరం ఉండదు.

తొలి రోజు మూడు ద్విచక్రవాహనాలు

జిల్లాలో కొత్త రిజిస్ట్రేషన్ల ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. దీంట్లో భాగంగా నల్లగొండలో మూడు ద్విచక్రవాహనాలు డీలర్‌ పాయింట్‌ వద్దే రిజిస్ట్రేషన్‌ చేయగా డీలర్‌ వాటిని ఆన్‌లైన్‌లో పర్మినెంట్‌ రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేయగా ఆర్టీఓ వాటికి పర్మినెంట్‌ రిజిస్ట్రేషన్‌ నంబర్లు కేటాయించారు. ఈకొత్త విధానం రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాల (కార్లు)ను చేర్చారు. అయితే గతంలో వాహనం కొనుగోలు చేసిన అక్కడే టీఆర్‌ నంబర్‌ను డీలర్లు అలాట్‌ చేసేవారు. ఆ తర్వాత వాహనదారుడు ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లి పర్మినెంట్‌ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు అలాంటి కష్టాలకు చెక్‌ పడింది.

ట్రాన్స్‌పోర్టు వాహనాలు

ఆర్టీఓ కార్యాలయంలోనే..

ప్రస్తుతం టూవీలర్‌, కార్లకు సంబంధించి మాత్రమే డీలర్‌ పాయింట్‌ వద్ద పర్మినెంట్‌ రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. అయితే ట్రాన్స్‌పోర్టు వాహనాలు ఇతర ఏవైనా కూడా రిజిస్ట్రేషన్‌కు ఆర్టీఓ కార్యాలయంలో పాత పద్ధతిలో జరగనున్నాయి. జిల్లాలో రోజూ మిర్యాలగూడ, నల్లగొండ కార్యాలయాల్లో వంద వాహనాల వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.

ఆర్టీఓ కార్యాలయానికి

వెళ్లకుండానే డీలర్‌ వద్దే ప్రక్రియ

ఫ అవసరమైన అన్ని డాక్యుమెంట్లు ఇస్తే సాయంత్రంలోగా పూర్తి

ఫ కొత్త విధానంతో సేవలు సులభతరం

ఫ ట్రాన్స్‌పోర్టు వాహనాలు

ఆర్టీఓ కార్యాలయాలకు వెళ్లాల్సిందే

షోరోమ్‌లోనే వాహన రిజిస్ట్రేషన్‌1
1/1

షోరోమ్‌లోనే వాహన రిజిస్ట్రేషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement