ముగిసిన కబడ్డీ పోటీలు
పెద్దఅడిశర్లపల్లి : మండలంలోని మేడారం లక్ష్మీ నరసింహస్వామి త్రయోదశ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని నిర్వహించిన తెలుగు రాష్ట్రాల స్థాయి మహిళల, పురుషుల కబడ్డీ పోటీలు శనివారం ముగిశాయి. మహిళల విభాగంలో శ్రీకాకుళం జట్టుకు ప్రథమ స్థానం, బాపట్ల జట్టు రెండోస్థానం, నల్లగొండ జట్టు మూడో స్థానం, ఖమ్మం జట్టు నాలుగో స్థానం, కొత్తగూడెం జట్టు ఐదో స్థానంలో నిలిచాయి. పురుషుల పోటీల్లో సాయి హాస్టల్ హైదరాబాద్ జట్టు ప్రథమ స్థానం, తెలంగాణ పోలీస్ జట్టు రెండో స్థానం, యూనియన్ బ్యాంక్ జట్టు మూడో స్థానం, సూర్యాపేట జట్టు నాలుగో స్థానం, కాసాని క్లబ్ జట్టు ఐదో స్థానంలో నిలిచాయి. శనివారం రాత్రి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ వద్దిరెడ్డి వెంకట్‌రెడ్డి, వైస్ చైర్మన్ నక్క సైదయ్య, సర్పంచ్‌లు గొంగడాల వెంకటయ్య, జయమ్మభాస్కర్‌రెడ్డి, విఠల్, హన్మారెడ్డి, అంజయ్య, కబడ్డీ అసోసియేషన్ సభ్యులు కర్తయ్య, ఇద్దయ్య, సత్తయ్య, రమేష్, మధు, సైదులు పాల్గొన్నారు.


