అ‘పూర్వ’ సమ్మేళనం
నల్లగొండ టూటౌన్ : నల్లగొండ పట్టణంలోని వివేకానంద స్కూల్‌లో 1975, 76, 77 సంవత్సరాల్లో ఏడవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం నల్లగొండ పట్టణంలోని ఓ హోటల్‌లో అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. యాభై సంవత్సరాల తర్వాత ఒకేచోట చేరిన అప్పటి విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠశాల సమయంలోని జ్ఞాపకాలను గుర్తుకు చేసుకున్నారు. ఉపాధ్యాయులు పి.భగవంతరెడ్డి, మల్లీశ్వరి, గిరికు విద్యార్థులు పాదాభివందనం చేసి సత్కరించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు గట్టు ఉదయ్‌కుమార్, కంది వెంకట్, సుధారాణి, శశిధర్, శర్మ, రఘుపతి, వెంకటేశ్వర్లు, రాజేశ్వరి, వసంత పాల్గొన్నారు.


