రోస్టర్ పాయింట్లతో మాలలకు అన్యాయం
ఫ మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు
మిర్యాలగూడ టౌన్ : ఎస్సీ వర్గీకరణ, ఉద్యోగ నోటిఫికేషన్లలో మాలలకు రోస్టర్ పాయింట్ల వల్ల తీవ్ర అన్యాయం జరుగుతుందని మాజీ ఎమ్మెల్సీ, ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ జూపూడి ప్రభాకర్‌రావు అన్నారు. ఆదివారం మిర్యాలగూడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న కాలంలో మాలలంతా ఏకతాటిపైకి రావాలన్నారు. మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు తాళ్లపల్లి రవి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు అనుకులంగా ఉన్న వివిధ పార్టీలకు తగిన బుద్ధి చెబుతామన్నారు. సమావేశంలో మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు బొప్పాని నగేష్, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ముండ్లగిరి కాంతయ్య, రాష్ట్ర అధ్యక్షుడు తలమల్ల హస్సేన్, మాడుగుల శ్రీనివాస్, గాజుల పున్నమ్మ, దిలావర్‌పూర్ సర్పంచ్ బెజ్జం సాయి, కామళ్ల జానయ్య, పెరుమాళ్ల ధనమ్మ, బైరం నర్సయ్య, తాళ్లపల్లి నరేష్, కొల్లి రాము, బాలయ్య, సాహెబ్, వెంకన్న ఉన్నారు.
ముగిసిన జంతు గణన
చందంపేట : చందంపేట మండలంలోని అటవీ ప్రాంతంలో ఈ నెల 19 నుంచి చేపట్టిన ఏఐటీఈ–2026 వన్య ప్రాణుల జంతు గణన ఆదివారంతో ముగిసింది. ట్రాప్ కెమెరాలు, సాసర్ పిట్స్ (నీటి తొట్టి)ల వద్దకు వచ్చే వాటిని ట్రాప్ కెమెరాలు, పాద ముద్రల ఆధారంగా జంతువుల గుర్తింపు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఎఫ్‌ఆర్‌ఓ ఎన్.భాస్కర్, సిబ్బంది పాల్గొన్నారు.
కార్పొరేట్‌కు దీటుగా గురుకులాలు
నాగార్జునసాగర్ : బోధనతో పాటు మౌలిక సౌకర్యాల కల్పనలో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా గురుకులాను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని మహాత్మా జ్యోతిరావు ఫూలే బీసీ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి సైదులు అన్నారు. శనివారం రాత్రి నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని హిల్‌కాలనీ బీసీ గురుకుల పాఠశాల వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీసీ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎనిమిదో తరగతి నుంచే నీట్, ఐఐటీ, ఎంసెట్ వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. కష్టపడి చదివిన విద్యార్థులే భవిష్యత్‌లో ఉన్నత స్థానాలు పొందుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్‌సీఓ స్వప్న, ప్రిన్సిపాల్ రవికుమార్, మూసీ గురుకులం ప్రిన్సిపాల్ సుధాకర్, ఏటీపీ సంతోష్, సరిత, శివాజీ, మత్స్యగిరి, మురళీధర్ పాల్గొన్నారు.
భువనగిరి
డీఎస్పీగా రవీందర్
భువనగిరి : భువనగిరి డీఎస్పీగా బి.రవీందర్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం డీజీపీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. సిద్దిపేట టాస్క్‌ఫోర్స్ ఏసీపీగా పనిచేస్తున్న ఈయన భువనగిరి డీఎస్పీగా బదిలీపై వచ్చారు. ఇప్పటి వరకు ఇక్కడ డీఎస్పీగా పనిచేసిన రాహుల్‌రెడ్డి ఇటీవల మల్కాజ్‌గిరి ట్రాఫిక్–1 డీసీపీగా బదిలీపై వెళ్లారు.
రోస్టర్ పాయింట్లతో మాలలకు అన్యాయం
రోస్టర్ పాయింట్లతో మాలలకు అన్యాయం


