కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
ఫ జిల్లా ఇన్‌చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్
మిర్యాలగూడ : రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలకు పనిచేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. శుక్రవారం మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్‌లతో కలిసి పాల్గొని మాట్లాడారు. ఇప్పటికే రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీ బలహీనపడిందన్నారు. కవిత సైతం పార్టీని వీడిందని, ఆ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఎంపీ రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గెలుపు గుర్రాలు, పార్టీలో అంకితభావంతో పనిచేసే వారికి టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యం ఉంటుందన్నారు. కార్యక్రమంలో చిరుమర్రి కృష్ణయ్య, తిరునగరు భార్గవ్, పగిడి రామలింగయ్యయాదవ్, మహబూబ్‌అలీ, స్కైలాబ్‌నాయక్, ఉపేందర్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, సైదులు, నర్సిరెడ్డి, దేశిడి శేఖర్‌రెడ్డి, గుడిపాటి నవీన్ తదితరులు పాల్గొన్నారు.


