అంబేద్కర్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం
రామగిరి (నల్లగొండ) : అంబేద్కర్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ బి.ధర్మనాయక్ తెలిపారు. నల్లగొండ రీజనల్ స్టడీ సెంటర్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ఆధ్వర్యంలో, రిజిస్ట్రార్ ఎల్.విజయకష్ణారెడ్డి, అకడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా పుష్పా చక్రపాణి పర్యవేక్షణలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలోని అన్ని రీజనల్ స్టడీ సెంటర్లలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టీసీఎస్ కంపెనీతో యూనివర్సిటీ ఒప్పందం చేసుకుని విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోందన్నారు. అంబేద్కర్ యూనివర్సిటీ ద్వారా విద్యనభ్యసించిన రాజకీయ ప్రముఖులు, ఉన్నత అధికారులు ఈ సమ్మేళనానికి హాజరై ప్రస్తుత విద్యార్థులకు దిశా నిర్దేశం చేయాలన్నారు. త్వరలో కార్యక్రమం తేదీని ప్రకటిస్తామని తెలిపారు. కార్యక్రమంలో నల్లగొండ స్డడీసెంటర్ కోఆర్డినేటర్ బొజ్జ అనిల్‌కుమార్, ఉమెన్స్ కాలేజీ కోఆర్డినేటర్ రాజారామ్, పూర్వ విద్యార్థుల అసోసియేషన్ ప్రెసిడెంట్ సైదుబాబు పాల్గొన్నారు.


