బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేయాలి
నార్కట్‌పల్లి : మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ధర్మకర్త నియమకానికి దేవదాయ శాఖ కమిషనర్ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. నల్లగొండ అసిస్టెంట్ కమిషనర్‌కు 20 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
నార్కట్‌పల్లి : మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం ఆయన ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌తో కలిసి చెర్వుగట్టులో బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భక్తులకు భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ సరఫరా సౌకర్యాలు కల్పించాలని సూచించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా క్యూలైన్ల నిర్వహణ, తాత్కాలిక షెడ్లు, వైద్య శిబిరాలు, అంబులెన్స్ సదుపాయం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అగ్నిమాపక, పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, ఆరోగ్య శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలన్నారు. ఎస్పీ శరత్‌చంద్ర పవార్ మాట్లాడుతూ ట్రాఫిక్ జామ్ కాకుండా చూసేందుకు పార్కింగ్ ప్రాంతాలు, రూట్ మ్యాపింగ్‌ను ముందుగానే సిద్ధం చేసినట్లు చెప్పారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగా ఒక ఏఎస్పీ, ఐదుగురు డీఎస్పీలు, 20 మంది సీఐలు, 50 మంది ఎస్‌ఐలతో కలిసి సుమారు వేయిమంది పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అవసరమైన చోట సహాయక సిబ్బందిని ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, డీఎస్పీ శివరాంరెడ్డి, ఆలయ ఈఓ మోహన్‌బాబు, తహసీల్దార్ వెంకటేశ్వర్‌రావు, ఎంపీడీఓ ఉమేష్, నార్కట్‌పల్లి సీఐ నాగరాజు, ఎస్‌ఐ విష్ణుమూర్తి, ఆలయ, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.
14 మందితో ‘ చెర్వుగట్టు’ ఉత్సవ కమిటీ
నార్కట్‌పల్లి : మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఈనెల 25 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలకు 14 మందితో ఉత్సవ కమిటీని ఏర్పాటు చేస్తూ దేవదాయ ధర్మదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు చెరువుగట్టు ఈఓ మోహన్‌బాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సభ్యులుగా చెర్వుగట్టుకు చెందిన వరాల రమేష్, రంగ శ్రవణ్, మందుల నరసింహ, కొమ్ము శ్రీను, గౌరుదేవి లక్ష్మయ్య, ఎల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన రేగటి శ్రీనివాస్‌రెడ్డి, నల్ల అనిత, బొలుగూరి గోపాల్, నార్కట్‌పల్లికి చెందిన ఇరుకుల సంపత్, ప్రజ్ఞాపురం సత్యనారాయణ, మర్రి లింగస్వామి, చిన్నతుమ్మలగూడెం గ్రామానికి చెందిన కమ్మలపల్లి మల్లేశం, ఏపీ లింగోటం గ్రామానికి చెందిన గద్దగోటి యాదయ్య, నకిరేకల్‌కు చెందిన వీరెల్లి రఘునందన్‌ను నియమించినట్లు వెల్లడించారు.
ఫ కలెక్టర్ చంద్రశేఖర్


