తమ్ముడిపై అన్న విజయం
నకిరేకల్ : మండలంలోని మండలాపురం గ్రామంలో సర్పంచ్‌గా తమ్ముడిపై అన్న పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుతం మండలాపురం గ్రామ సర్పంచ్ స్థానం ఎస్సీ జనరల్‌గా రిజర్వ్ అయ్యింది. గ్రామానికి చెందిన తీగల లింగయ్య చిన్న కుమారుడు నాగయ్య కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే లింగయ్య పెద్ద కుమారుడు తీగల వెంకటయ్య కూడా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశారు. గురువారం జరిగిన పోలింగ్‌లో వెంకటయ్యకు 503 ఓట్లు రాగా అతడి తమ్ముడు తీగల నాగయ్యకు 425 ఓట్లు వచ్చాయి. 78 ఓట్ల మెజార్టీతో తమ్ముడిపై అన్న విజయం సాధించారు.
బాండ్ పేపర్‌పై హామీ పత్రం
మేళ్లచెరువు : మండలంలోని రేవూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న జూనెబోయిన అచ్యుతరావు బాండ్ పేపర్ ప్రతులను ఇంటింటికీ పంచుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. తాను సర్పంచ్‌గా గెలిస్తే చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందించే సేవలను బాండ్ పేపర్‌పై అఫడవిట్ రూపంలో రాసి మరీ ప్రజలకు అందిస్తున్నారు. తాను ఇచ్చిన హామీలు నెరవేర్చని పక్షంలో తనపై చర్యలు తీసుకునే అధికారం ప్రజలకు ఉందంటూ అందులో పేర్కొన్నారు.
తమ్ముడిపై అన్న విజయం


