మలి విడతలోనూ అధికార పార్టీ మద్దతుదారులకే అధిక స్థానాలు
ఫ మిర్యాలగూడ డివిజన్‌లోని 282 పంచాయతీల్లో 38 ఏకగ్రీవం
ఫ మూడు గ్రామాల్లో జరగని ఎన్నికలు.. 241 చోట్ల పోలింగ్
ఫ కాంగ్రెస్ పార్టీకి 194 పంచాయతీల్లో పట్టం
ఫ 67 స్థానాలకు పరిమితమైన బీఆర్‌ఎస్
ఫ తిరుమలగిరి సాగర్, నిడమనూర్ మండలాల్లో రెబల్స్ హవా
మొదటి, రెండో విడత ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు అత్యధిక స్థానాలను కై వసం చేసుకున్నారు. మొదటి, రెండో విడతలో 597 స్థానాలకు ఎన్నికలు జరగ్గా అందులో 407 స్థానాలను కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు దక్కించుకున్నారు. ఇక బీఆర్‌ఎస్ మద్దతుదారులు 146 స్థానాల్లో గెలుపొందారు. సీపీఐ/సీపీఎం/ఇతరులు కలుపుకొని రెండు విడతల్లో 40 మంది గెలుపొందగా, బీజేపీ 4 స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది. రెండు విడతల్లోనూ బీజీపీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. మొదటి విడత ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ 13 మంది రెబల్స్ కలుపుకొని 213 స్థానాలను దక్కించుకోగా, రెండో విడతలో కాంగ్రెస్ 24 మంది రెబల్స్ కలుపుకొని 194 స్థానాలను దక్కించుకున్నారు. ఇక బీఆర్‌ఎస్ మొదటి విడతలో 79 స్థానాలను దక్కించుకోగా, రెండో విడత ఎన్నికల్లో 67 స్థానాలను పొందింది. ఇతరులు మొదటి విడతలో 23 మంది, రెండో విడతలో 17 మంది గెలుపొందారు.
మాడుగులపల్లి సర్పంచ్‌గా ఎన్నికైన నరేష్‌ను భుజాలపై ఎత్తుకుని ఊరేగిస్తున్న గ్రామస్తులు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికల్లోనూ పల్లె ఓటర్లు అధికార పార్టీకే పట్టం కట్టారు. మిర్యాలగూడ డివిజన్ పరిధిలో పది మండలాల్లోని 282 గ్రామ పంచాయతీల్లో 194 స్థానాలను అధికార కాంగ్రెస్ మద్దతు దారులు దక్కించుకున్నారు. బీఆర్‌ఎస్ 67 స్థానాలకు పరిమితం కావాల్సి వచ్చింది. కాంగ్రెస్ గెలుపొందిన స్థానాల్లో ఆ పార్టీకి చెందిన రెబల్ అభ్యర్థులు 24 స్థానాల్లో విజయం సాధించారు. ఇక స్వతంత్ర అభ్యర్థులు 17 స్థానాల్లో గెలుపొందారు. బీజేపీ అభ్యర్థులు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. బీజేపీ ఒకే ఒక్క స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. తిరుమలగిరి సాగర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థులపై రెబల్స్ విజయం సాధించగా, నిడమనూరు, త్రిపురారంలోనూ కాంగ్రెస్ రెబల్స్ కొంతమంది గెలుపొందారు.
38 స్థానాలు ఏకగ్రీవం..
గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికలు మిర్యాలగూడ డివిజన్‌లోని పది మండలాల పరిధిలో ఆదివారం జరిగాయి. డివిజన్ పరిధిలోని 282 గ్రామ పంచాయతీలు ఉండగా 38 స్థానాల్లో సర్పంచ్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 3 గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు జరుగలేదు. దీంతో 241 పంచాయతీల్లో ఆదివారం పోలింగ్ సాగింది. మొత్తం 2,408 వార్డులకు గాను 23 వార్డుల్లో ఎన్నికలు జరుగలేదు. ఇక 553 వార్డుల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా 1,832 వార్డుల్లో ఎన్నికలు జరిగాయి. ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్ జరిగింది. ఆ తర్వాత కౌంటింగ్ నిర్వహించారు. అర్ధరాత్రి వరకు అన్ని గ్రామాల్లో ఫలితాలను ప్రకటించారు.
తిరుమలగిరి సాగర్‌లో రెబల్స్ విజయం
తిరుమలగిరి సాగర్ మండలంలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు ఎక్కువగా విజయం సాధించారు. అక్కడ అధికార పార్టీకి అత్యధిక స్థానాలు వచ్చినప్పటికీ బీఆర్‌ఎస్ అభ్యర్థులు కూడా విజయం సాధించారు. తిరుమలగిరి సాగర్‌లో బీఆర్‌ఎస్ పోటీ చేసిందే 4 స్థానాల్లో అందులో 3 స్థానాలలో బీఆర్‌ఎస్ సర్పంచ్‌లు విజయం సాధించారు. మిగిలిన పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతు దారులకు పోటీగా ఉన్న 10 మంది రెబల్ అభ్యర్థులు విజయం సాధించారు. మొత్తం మండలంలో 35 స్థానాలు ఉండగా అందులో 12 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అయితే మిగిలిన 23 స్థానాలకు ఎన్నికలు జరగ్గా 10 స్థానాల్లో రెబల్ అభ్యర్థులు గెలుపొందారు. నిడమనూరులో 5 స్థానాల్లో, త్రిపురారంలో 3, అడవిదేవులపల్లిలో 3, దామరచర్లలో 3 స్థానాల్లో రెబల్ అభ్యర్థులు గెలుపొందారు.
మండలాల వారీగా ఫలితాలు..
మండలం జీపీలు కాంగ్రెస్ కాంగ్రెస్ బీఆర్‌ఎస్ బీఆర్‌ఎస్ బీజేపీ సీపీఐ/సీపీఎం/
ఏకగ్రీవం ఏకగ్రీవం ఇతరులు
అడవిదేవులపల్లి 13 2 9 (రె.3) 0 2 0 0
దామరచర్ల 35 1 25 (రె.3) 0 8 0 1
మిర్యాలగూడ 46 1 23 0 14 0 8
మాడుగులపల్లి 28 5 12 0 9 0 0
వేములపల్లి 12 0 9 0 3 0 0
అనుముల 24 3 12 1 3 0 4
పెద్దవూర 28 4 15 0 8 0 1
తిరుమలగిరిసాగర్ 35 11 20 (రె.10) 1 3 0 0
నిడమనూరు 29 0 23 (రె.5) 0 4 1 1
త్రిపురారం 32 7 12 (రె.3) 1 10 0 2
మొత్తం 282 34 160 3 64 1 17
(నోటు: మూడు గ్రామాల్లో ఎన్నికలు జరుగలేదు.)
మలి విడతలోనూ అధికార పార్టీ మద్దతుదారులకే అధిక స్థానాలు
మలి విడతలోనూ అధికార పార్టీ మద్దతుదారులకే అధిక స్థానాలు
మలి విడతలోనూ అధికార పార్టీ మద్దతుదారులకే అధిక స్థానాలు
మలి విడతలోనూ అధికార పార్టీ మద్దతుదారులకే అధిక స్థానాలు


