పోటెత్తిన ఓటర్లు
పురుషుల కంటే మహిళలే ఎక్కువ
ముగిసిన రెండవ విడత పంచాయతీ పోలింగ్
ఫ 88.74 శాతం పోలింగ్ నమోదు
ఫ మొదటి విడత కంటే స్వల్పంగా తగ్గుదల
ఫ అత్యఽధికంగా మాడ్గులపల్లి మండలంలో 92.34 శాతం, అత్యల్పంగా మిర్యాలగూడలో 85.79 శాతం నమోదు
ఫ మొదటి రెండు గంటల్లో 28.15 శాతమే.. ఆ తర్వాత పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చిన జనం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికల పోలింగ్‌కు ఓటర్లు పోటెత్తారు. మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని 10 మండలాల్లోని 241 గ్రామ పంచాయతీలకు 1,832 వార్డు మెంబర్లకు ఆదివారం ఎన్నికలు జరిగాయి. మొత్తంగా 88.74 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా 9 గంటల తర్వాత పోలింగ్ బూత్‌లకు జనాలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అయితే మొదటి విడత కంటే రెండో విడత జరిగిన ఎన్నికల్లో పోలింగ్ శాతం స్వల్పంగా తగ్గింది. ఈసారి పురుషుల కంటే మహిళలే ఎక్కువ మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మొదటి రెండు
గంటల్లో 28.15 శాతం నమోదు
ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో పది మండలాల పరిధిలో మొదటి రెండు గంటల్లో అంటే 9 గంటల వరకు 28.15 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం ఓటర్లు 2,99,576 మంది ఉండగా మొదటి రెండు గంటల్లోనే 84,333 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదే విధంగా 9 నుంచి 11 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకున్న వారి సంఖ్య 1,69,086కు పెరిగింది. దీంతో 56.44 శాతం పోలింగ్ నమోదైంది. ఇక మధాహ్నం ఒంటి గంట వరకు ఓటు హక్కును వినియోగించుకున్న వారి సంఖ్య 2,47,859 చేరుకోగా 82.74 శాతం పోలింగ్ నమోదైంది. ఒంటి గంట వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న వారికి ఓటేసేందుకు అవకాశం ఇచ్చారు. ఇలా మొత్తంగా 2,65,852 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో రెండో విడతలో 88.74 శాతం పోలింగ్ నమోదైంది.
మొదటి విడత కంటే తగ్గిన పోలింగ్ శాతం
మొదటి విడతలో కంటే రెండో విడతలో స్వల్పంగా పోలింగ్ శాతం తగ్గింది. మొదటి విడతలో నల్లగొండ, చండూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 14 మండలాల్లో జరిగిన ఎన్నికల్లో 90.53 శాతం పోలింగ్ నమోదు కాగా రెండో విడతలో మిర్యాలగూడ డివిజన్‌లోని 10 మండలాల్లో జరిగిన ఎన్నికల్లో 88.74 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. రెండో విడత పోలింగ్‌లో అత్యధికంగా మాడుగులపల్లి మండలంలో 92.34 శాతం పోలింగ్ నమోదు కాగా, మిర్యాలగూడలో 85.79 శాతం పోలింగ్ నమోదైంది.
ఓటేసేందుకు
వృద్ధురాలిని
మోసుకొస్తున్న
యువకులు
రెండో విడత ఎన్నికల్లోనూ పురుషుల కంటే మహిళలే అత్యధికంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 1,30,941 మంది ఓటు వినియోగించుకోగా, మహిళలు 1,34,900 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ట్రాన్స్‌జెండర్లు 11 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మండలాల వారీగా పోలైన ఓట్ల వివరాలు..
మండలం మొత్తంఓట్లు పోలైన ఓట్లు
అడవిదేవులపల్లి 13,915 12,687
అనుముల 20,349 18,587
దామరచర్ల 40,314 35,898
మాడ్గులపల్లి 24,212 22,357
మిర్యాలగూడ 53,537 45,928
నిడమనూరు 36,094 32,075
పెద్దవూర 32,742 28,496
త్రిపురారం 31,763 28,124
తిరుమలగిరిసాగర్ 26,082 23,276
వేములపల్లి 20,568 18,424
మొత్తం 2,99,576 2,65,852
పోటెత్తిన ఓటర్లు
పోటెత్తిన ఓటర్లు
పోటెత్తిన ఓటర్లు


