పోలింగ్ ప్రశాంతంగా సాగింది
మిర్యాలగూడ టౌన్ : రెండవ విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా సాగాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఆదివారం ఆమె.. జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకురాలు కుర్ర లక్ష్మితో కలిసి దామరచర్ల మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆ సమయంలో ఓ పోలింగ్ బూత్‌లో ఎక్కువ మంది ఓటర్లు ఉండడంతో ప్రొసిడింగ్ అధికారిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రంలో వీధి నిర్వహాణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు పీఓ సంధ్యకు షోకాజ్ నోటీసును జారీ చేయాలని ఆదేశించారు. ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లతో ముఖాముఖి మాట్లాడారు. అన్ని పొలింగ్ కేంద్రాల నుంచి పోలైన బ్యాలెట్స్‌తో పాటు ఎన్నికల సామగ్రిని దగ్గరలోని ఎస్టీఓలో భద్రపరచాలని ఆదేశించారు. ఆమె వెంట మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, ఎంపీడీఓ మంగ, ఎంపీఓ అశోక్, డీపీఓ వెంకయ్య, డీసీఓ పత్యానాయక్, జిల్లా పశు సంవర్థకశాఖ అధికారి డాక్టర్ రమేష్ తదితరులున్నారు.


