పోలింగ్ పారదర్శకంగా నిర్వహించాలి
మాడుగులపల్లి : రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శనివారం ఆమె మాడుగులపల్లిలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను తనిఖీ చేసి మాట్లాడారు. ఎన్నికల్లో పోలింగ్‌తోపాటు ఓట్ల లెక్కింపును పారదర్శకంగా నిర్వహించాలని, ఎలాంటి వివాదాలకు, నిర్లక్ష్యానికి తావివ్వొద్దని సూచించారు. ముఖ్యంగా పోలైన బ్యాలెట్ల భద్రత, బాధ్యత పూర్తిగా స్టేజ్–2 రిటర్నింగ్ అధికారులపై ఉందన్నారు. దగ్గరలోని ఎస్‌టీవోలో జమ చేసే వరకు వారు బాధ్యత వహించాలన్నారు. ఎన్నికల సంఘం నిర్ధేశించి సమయానికి కౌంటింగ్‌ను ప్రారంభించాలని, ఫలితాల వెల్లడికి జాప్యం చేయవద్దని, ఎవరి అనుమతి కోసం ఆగవద్దన్నారు. సిబ్బంది ఎవరైనా తప్పు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆదివారం ఎన్నికలు జరగనున్న పది మండలాల్లో 250 పోలింగ్ కేంద్రాల లొకేషన్లలో వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేశామని అన్నారు. ఆమె వెంట సబ్ కలెక్టర్ నారాయణ్‌అమిత్, డీపీఓ వెంకయ్య, జెడ్పీ సీఈఓ శ్రీనివాస్‌రావు, తహసీల్దార్, ఎంపీడీఓ ఉన్నారు.
పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు
నల్లగొండ : పంచాయతీ రెండవ విడత ఎన్నికల పోలింగ్, కౌంటింగ్‌ను పకడ్బందీగా నిర్వహించేలా ఏర్పాట్లు చేశామని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడారు. ప్రతి 200 ఓట్లకు ఒక కౌంటింగ్ టేబుల్ ఏర్పాటు చేయాలన్నారు. ఎక్కడైనా రీ కౌంటింగ్ సమస్య వస్తే కౌంటింగ్ పూర్తయిన 15 నిమిషాల్లో రాత పూర్వకంగా ఫిర్యాదు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. రీకౌంటింగ్ నిర్వహించాలా, వద్దా అన్నది పూర్తిగా స్టేజ్–2 ఆర్‌ఓపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. రీ కౌంటింగ్‌కు వచ్చిన ఫిర్యాదుకు స్టేజ్ –2 ఆర్‌ఓ సమ్మతిస్తే లేదా తిరస్కరిస్తే ఆ విషయాన్ని రాతపూర్వకంగా ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. పోలింగ్ కేంద్రంలో ఓట్లు వేసేటప్పుడు ముగ్గురు మాత్రమే లోపల ఉండేలా చూసుకోవాలని సూచించారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి


