అభివృద్ధికే పట్టం కట్టారు
నల్లగొండ : గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారని డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్ అన్నారు. శనివారం నల్లగొండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మొదటి విడత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 70 శాతం స్థానాలను కాంగ్రెస్ పార్టీ కై వసం చేసుకుందన్నారు. ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇచ్చేందుకు ప్రయత్నించినా కేంద్రంలోని బీజేపీ మోకాలడ్డిందని అయినా.. బీసీలకు కాంగ్రెస్ 52 శాతం టికెట్లు ఇచ్చిందన్నారు. గెలిచిన సర్పంచ్‌లు, వార్డు మెంబర్లకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఓడిన వారు కూడా నిరాశ చెందాల్సిన అవసరం లేదని భవిష్యత్‌లో ఎన్నో అవకాశాలు పార్టీ కల్పిస్తుందన్నారు.
అభివృద్ధిపై చర్చకు సిద్ధం
కాంగ్రెస్ పార్టీ పంచాయతీ ఎన్నికల్లో అత్యదిక స్థానాలను కై వసం చేసుకుంటే మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి అత్తెసరు మార్కులతో గెలిచి కాంగ్రెస్‌ను విమర్శించడం సరైంది కాదన్నారు. పంచాయతీ ఎన్నికల్లో రౌడీయిజం చేసి గెలిచారంటూ మాట్లాడటం జగదీశ్‌రెడ్డికి తగదన్నారు. జిల్లాలో ఏ గ్రామానికై నా వస్తానని.. పదేళ్లలో బీఆర్‌ఎస్ చేసిన అభివృద్ధి.. రెండేళ్లలో కాంగ్రెస్ ద్వారా ప్రజలకు అందిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై చర్చకు సిద్ధమన్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పది శాతం సీట్లు కూడా గెలువలేదన్నారు. 2, 3వ విడత ఎన్నికల్లోనూ ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తారన్నారు. సమావేశంలో ఎస్సీ సెల్ చైర్మన్ బోడ స్వామి, గోట వెంకన్నగౌడ్, సలీం, ప్రవీణ్, గోపినాథ్, కూర లింగయ్య, వెంకన్నగౌడ్, యోగానందం, ప్రకాష్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఫ డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్


