బొట్టుగూడ స్కూల్‌కు.. కార్పొరేట్ హంగులు
నల్లగొండ టూటౌన్ : నల్లగొండ నడిబొడ్డున బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాల కార్పొరేట్ హంగులతో సిద్ధమైంది. 70 సంవత్సరాలుగా సొంత భవనం లేని ఈ పాఠశాలను కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.8 కోట్లతో అత్యాధునికంగా నిర్మాణం చేపట్టారు. ఈనెల 20వ తేదీన.. ఈ స్కూల్‌ను ప్రారంభించడానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. 70 సంవత్సరాలుగా ఈ స్కూల్‌లో వేలాది మంది విద్యార్థులు చదువుకొని దేశ, విదేశాల్లో ఉన్నత హోదాల్లో ఉన్నారు. ఎంతో ప్రాధాన్యం ఉన్న ఈ స్కూల్‌కు మంత్రి కోమటిరెడ్డి ఔధార్యంతో సొంత భవనం కల నెరవేరింది. ఈ పాఠశాలను ఈనెల 20వ తేదీన సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నిర్ణయించారు. దాంతో స్కూల్ భవనానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో మిగిలిపోయిన పనులు పూర్తి కానున్నాయి.
జీప్లస్ త్రీ భవనం..
కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బొట్టుగూడ (ప్రకాశంబజార్)లో రూ.8 కోట్లతో జీ ప్లస్ త్రీ భవనాన్ని నిర్మించారు. సుమారు 600 మంది విద్యార్థులు చదువుకునేలా నిర్మాణం చేపట్టారు. ప్రభుత్వ పాఠశాల అయినా విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో ఆధునిక సౌకర్యాలు కల్పించారు. ఈ భవనంలో 36 గదుల్లో ఏసీ సమకూర్చారు. పైఅంతస్తులో ఆడిటోరియం, ల్యాబ్ ఏర్పాటు చేశారు. పనుల పర్యవేక్షణ బాధ్యతను మంత్రి కోమటిరెడ్డి ఈ పాఠశాల ఉపాధ్యాయుడు సలీమ్‌కు అప్పగించారు. 16 నెలలుగా ఆయన రోజూ ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు.
బొట్టుగూడ స్కూల్ భవనం
ఫ జీ ప్లస్ త్రీ భవనం నిర్మించిన కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్
ఫ ఏసీతో కూడిన 36 తరగతి గదులు
ఫ ఈ నెల 20న ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రారంభం


