రాత్రి 8 గంటల వరకు పూర్తి కానున్న కౌంటింగ్
ఆదివారం రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య పది కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. పది మండలా పరిధిలో 3,28,016 మంది ఓటర్లు ఉండగా, అందులో 1,60,821 మంది పురుషులు, 1,67,166 మంది మహిళలు, 29 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. వారంతా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ తరువాత ముందుగా వార్డు సభ్యుల ఓట్లను, ఆ తరువాత సర్పంచ్ అభ్యర్థుల ఓట్లను లెక్కిస్తారు. సర్పంచ్‌ల ఎన్నిక తర్వాత అక్కడే వెంటనే ఉప సర్పంచ్‌లను ఎన్నుకుంటారు. దీంతో రెండో విడత ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది.


