ఈటూరులో తీవ్ర ఉత్కంఠ
ఫ డ్రా ద్వారా తేలిన ఫలితం
నాగారం : మండలంలోని ఈటూరు గ్రామ పంచాయతీకి గురువారం జరిగిన పోలింగ్, ఓట్ల లెక్కింపు అర్థరాత్రి వరకు కొనసాగింది. గ్రామంలో మొత్తం 3013 ఓట్లు ఉండగా 2,609 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి వంగూరి భిక్షపతి, స్వతంత్ర అభ్యర్థి వంగూరి దామోదర్‌కు సమానంగా చెరో 1227 ఓట్లు వచ్చాయి. ఫలితంపై తవ్ర ఉత్కంఠ నెలకొంది. దాంతో ఎన్నికల అధికారులు రీకౌంటింగ్ నిర్వహించారు. రీకౌంటింగ్‌లో ఇద్దరు అభ్యర్థులకు ఒక్కో ఓటు చెల్లకుండా పోవడంతో మళ్లీ ఇద్దరికి 1226 చొప్పున ఓట్లు రాగా ఫలితం టై అయ్యింది. అనంతరం సూర్యాపేట ఆర్డీఓ వేణుమాధవరావు సమక్షంలో రిటర్నింగ్ అధికారులు ఇద్దరు అభ్యర్థుల పేర్లను చీటీలపై రాసి డ్రా తీశారు. డ్రాలో స్వతంత్ర అభ్యర్థి వంగూరి దామోదర్ గెలుపొందారు.


