సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలి
నల్లగొండ: సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్ అన్నారు. సైబర్ జాగరూకత దివస్ సందర్భంగా గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని దీప్తి నర్సింగ్ కళాశాల విద్యార్థినులకు సైబర్ నేరాల నియంత్రణపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. అనేక మంది ప్రజలు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి మోసపోతున్నారన్నారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో జరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సైబర్ నేరగాళ్ల మోసాల తీరును కళాశాల విద్యార్థినుల ద్వారా ప్రజలకు తెలియజెప్పాలన్నారు. సైబర్ నేరా లకు గురైన వెంటనే స్పందించి 1930కు, పోలీసులకు సమాచారం అందించాలన్నారు. జంప్‌డ్ డిపాజిట్ స్కీం, డిజిటల్ అరెస్టు, ఇన్వెస్టిమెంట్ ప్రాడ్, సైబర్ బుల్లింగ్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. బ్యాంక్ అదికారులు ఫోన్ చేసి ఓటీపీ వివరాలు అడగరని, బ్యాంక్ వారు ఎలాంటి మెసేజ్‌లు, లింక్స్ పంపరని ఈ విషయాలు గుర్తుంచుకుని మీ కుటుంబ సభ్యులకు తెలుపాలన్నారు. కార్యక్రమంలో సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీనారాయణ, ఎస్బీ సీఐ రాము, వన్‌టౌన్ సీఐ రాజశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐ విష్ణు, కళాశాల సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.
ఫ ఎస్పీ శరత్‌చంద్ర పవార్


