మర్రిగూడ : గ్రామాల్లో ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు, వైద్య సిబ్బంది నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని డీఎంహెచ్‌ఓ పుట్ల శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఎప్పటికప్పుడు ఆరోగ్యపరమైన సలహాలు, సూచనలు అందిస్తూ సీజనల్ వ్యాధుల బారిన పడకుండా చూడాలన్నారు. జ్వర పీడితులకు తప్పకుండా స్క్రీనింగ్ చేయాలన్నారు. అనంతరం కమ్యూనిటి హెల్త్ సెంటర్ ఆవరణలో వైద్య సిబ్బందితో కలిసి వందేమాతరం ఆలపించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ కల్యాణ్ చక్రవర్తి, సూపరింటెండెంట్ శంకర్‌నాయక్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శాలిని, వైద్యులు దీపక్, రుబీనా, ఏఎన్‌ఎంలు, వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.


