వందేమాతరం ఆలాపన
నల్లగొండ : ప్రజల్లో దేశభక్తి భావనను పెంపొందించేందుకు వందేమాతర జాతీయ గేయం సామూహిక ఆలాపన కార్యక్రమాన్ని చేపట్టినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఆవరణలో సిబ్బంది, వివిధ శాఖల అధికారులతో కలిసి వందేమాతరం గేయాన్ని సామూహికంగా ఆలపించారు. ఈ సందర్భంగా ఆమె మట్లాడుతూ బంకించంద్ర చటర్జీ వందేమాతర గేయాన్ని రచించి 150 సంవత్సరాలు అయిన సందర్భంగా సామూహిక వందేమాతర గేయాలాపన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డీఓ అశోక్‌రెడ్డి, కలెక్టరేట్ ఏఓ మోతిలాల్, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


