ర్యాగింగ్‌కు పాల్పడితే సహించం
నల్లగొండ టౌన్ : విద్యా సంస్థలో ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. నల్లగొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ కలకలంపై శుక్రవారం ఆమె.. స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ నారాయన్ అమిత్, ఆర్డీఓ అశోక్‌రెడ్డిలతో కలిసి ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సత్యనారాయణ, హెచ్‌ఓడీలు, అధ్యాపక బృందం, విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తమను ఎవరూ ర్యాగింగ్ చేయలేదని జూనియర్ విద్యార్థులు తమ దృష్టికి తీసుకొచ్చారని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగ కలెక్టర్ మాట్లాడుతూ ర్యాగింగ్ విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా ఉందని ఎవరైనా ర్యాగింగ్ చేస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. కళాశాలలో ర్యాగింగ్ నిరోధక కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఎంబీబీఎస్ చదవి ఒక మంచి డాక్టర్‌గా సేవలు అందించాల్సిన విషయం దృష్టిలో ఉంచుకుని మంచిగా మసలుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.
రెసిడెన్షియల్ స్కూల్ పనుల పరిశీలన
నల్లగొండ : నల్లగొండలోని ఎస్‌ఎల్‌బీసీ కాలనీలో చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. పనులను ప్రతినెలా పర్యవేక్షించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీఓ వై.అశోక్‌రెడ్డి, ఇంజనీరు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి


