నల్లగొండ డిపో నుంచి ప్రత్యేక బస్సులు
రామగిరి(నల్లగొండ): నల్లగొండ ఆర్టీసీ డిపో నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు ప్రత్యేక బస్సు సర్వీసులు ప్రారంభించినట్లు డిపో మేనేజర్ వెంకటరమణ తెలిపారు. నల్లగొండ నుంచి హైటెక్ సిటీ, రాజీవ్‌గాంధీ ఎయిర్‌పోర్టుకు రెండు డీలక్స్ బస్సులు ప్రారంభించనట్లు పేర్కొన్నారు. నల్లగొండ నుంచి వయా ఔటర్ రింగ్‌రోడ్డు మీదుగా విప్రో హైటెక్ సిటీకి, ఎల్‌బీ నగర్ మీదుగా ఎయిర్‌పోర్టు మధ్య ఈ బస్సులు నడుస్తాయని పేర్కొన్నారు. నల్లగొండ నుంచి హైటెక్ సిటీకి ఉదయం 6.45, మధ్యాహ్నం 2 గంటలకు, హైటెక్ సిటీ నుంచి ఉదయం 10, సాయంత్రం 6 గంటలు బస్సులు బయలుదేరుతాయని తెలిపారు. నల్లగొండ నుంచి ఎయిర్‌పోర్టుకు ఉదయం 10, మధ్యాహ్నం 6.30 గంటలకు, ఎయిర్‌పోర్టు నుంచి నల్లగొండకు మధ్యాహ్నం 1 గంటకు, ఉదయం 5 గంటల ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు. ప్రయాణికుల అభ్యర్థన మేరకు బస్సులను నడుపుతున్నట్లు ఆయన తెలిపారు.
సీపీఐ బహిరంగ సభను
జయప్రదం చేయాలి
దేవరకొండ: డిసెంబర్ 26న ఖమ్మంలో నిర్వహించ తలపెట్టిన సీపీఐ భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం దేవరకొండ పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో జరిగిన ఆ పార్టీ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయ మాట్లాడారు. సీపీఐ శతాబ్ది ముగింపు ఉత్సవాల సందర్భంగా ఈ సభ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, పల్లా నర్సింహారెడ్డి, ఉజ్జిని యాదగిరిరావు, పల్లా దేవేందర్‌రెడ్డి, మైనొద్దీన్, తూం బుచ్చిరెడ్డి, వెంకటరమణ, కనకాచారి, సుదర్శన్‌రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, వెంకటయ్య, జయరాములు పాల్గొన్నారు.
‘ముదిమాణిక్యం’
మరమ్మతుల పరిశీలన
నిడమనూరు : సాగర్ ఎడమ కాల్వపై ఉన్న ముదిమాణిక్యం మేజర్ షట్టర్ మరమ్మతులను గురువారం ఎన్‌ఎస్‌పీ ఎస్‌ఈ మల్లికార్జున్‌రావు, ఈఈ గోపినాథ్, డీఈ మాలూనాయక్ పరిశీలించారు. రెండో రోజు సిబ్బంది మేజర్ తూములోకి 20 అడుగుల కిందకు దిగి తూము గేటుకు మరమ్మతులు చేయడానికి యత్నించగా సాధ్యం కాలేదు. కొంత మేర గేటును దించి నీటి ప్రవాహన్ని నియంత్రించినట్లు తెలిసింది. వీటిని అధికారులు దగ్గరుండి పర్యవేక్షించారు. అనంతరం మేజర్ దుస్థితిపై ఎన్‌ఎస్‌పీ ఉన్నతాధికారులతో ఎస్‌ఈ, ఈఈ సమీక్షించారు. సాగర్ ఆధునికీకరణ పనుల్లో కొత్త షట్టర్లు ఏర్పాటు చేయకపోవడంతో నీటి ఉధృతికి షట్టర్ దెబ్బ తిన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రధానంగా మిర్యాలగూడ పట్టణానికి తాగునీరు, ఆయకట్టు చివరి భూములకు నీటి అవసరాల నిమిత్తం సాగర్ ఎడమ కాల్వకు 5 వేల క్యూసెక్కులు నీటి విడుదల చేయించినట్టు డీఈ మాలూనాయక్ తెలిపారు.
జైలు పెట్రోల్ బంక్‌లో
సక్రమంగానే కొలతలు
నల్లగొండ టూటౌన్ : జిల్లాకేంద్రంలోని జైలు ఖానా పెట్రోల్ బంక్‌లో పెట్రోల్, డీజిల్ అమ్మకాల్లో ఎలాంటి అవకతకలు లేవని, అన్ని సక్రమంగానే ఉన్నట్లు జిల్లా లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెపెక్టర్ శ్రీనివాస్ అన్నారు. బంక్‌పై వచ్చి న ఫిర్యాదు మేరకు గురువారం లీగల్ మెట్రా లజీ అధికారులు పెంట్రోల్ బంక్‌లో పెట్రోల్, డీజిల్‌ను ఐదు లీటర్ల క్యాన్‌లో పట్టి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బంక్‌లో ఓ పైప్ కారణంగా డీజిల్ ట్రాక్టర్‌లోకి రాలేదని, దాని ఆధారంగా ఫిర్యాదు చేయడంతో తనిఖీ చేసినట్లు తెలిపారు. జిల్లా జైలు సూపరిండెంటెంట్ ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వ బంక్‌లో ఎలాంటి అక్రమాలకు ఆస్కారం లేదన్నారు.
నల్లగొండ డిపో నుంచి ప్రత్యేక బస్సులు
నల్లగొండ డిపో నుంచి ప్రత్యేక బస్సులు


