కార్పొరేషన్‌గా నీలగిరి! | - | Sakshi
Sakshi News home page

కార్పొరేషన్‌గా నీలగిరి!

Nov 7 2025 7:37 AM | Updated on Nov 7 2025 7:37 AM

కార్పొరేషన్‌గా నీలగిరి!

కార్పొరేషన్‌గా నీలగిరి!

కార్పొరేషన్‌గా

ఏర్పడితే భారీగా నిధులు

నీలగిరి మున్సిపల్‌ వివరాలు..

వేగంగా పట్టణీకరణ

నల్లగొండ టూటౌన్‌: రాష్ట్రంలో పెద్ద పట్టణంగా వెలుగొందుతున్న నీలగిరి మున్సిపాలిటీ కార్పొరేషన్‌ అయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇటీవల కార్పొరేషన్లుగా మార్చిన విషయం తెలిసిందే. ఇందులో మహబూబ్‌నగర్‌తోపాటు నీలగిరి కన్నా చిన్నవైన కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలను కార్పొరేషన్‌లుగా ఏర్పాటు చేసింది. దీంట్లో భాగంగా నీలగిరి మున్సిపాలిటీని కూడా కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు. నీలగిరి చుట్టూ పక్కల ఉన్న గ్రామాలను విలీనం చేయకుండానే ప్రస్తుతం ఉన్న మున్సిపాలిటీనే కార్పొరేషన్‌గా మార్చాలని మంత్రి విన్నవించారు. అయితే ముఖ్యమంత్రి నుంచి సీడీఎంఏకు మంత్రి ప్రతిపాదన వెళితే కార్పొరేషన్‌ ఏర్పాటుకు మార్గం సుగుమం కానుంది.

1950లో లోకల్‌ ఫండ్‌గా ఏర్పాటు

స్వాతంత్య్రానంతరం 1950లో నీలగిరి లోకల్‌ ఫండ్‌ (మున్సిపాలిటీ)గా అవతరించింది. ఆ తర్వాత 1956లో 12 వార్డులతో పూర్తిస్థాయి మున్సిపాలిటీగా ఏర్పాటైంది. ఎనిమిదేళ్ల క్రితం గ్రేడ్‌–1 మున్సిపాలిటీ నుంచి ప్రస్తుతం 48 వార్డులతో స్పెషల్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీగా అవతరించింది. అప్పట్లో చిన్న పట్టణంగా ఉన్న నీలగిరి పెరుగుతూ వచ్చింది. దశాబ్ద కాలంగా పిల్లల చదవులు, ఉపాధి అవకాశాల కోసం వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ధ సంఖ్యలో ప్రజలు జిల్లా కేంద్రానికి వచ్చి స్థిర పడుతున్నారు. పట్టణాల జనాభాను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మున్సిపాలిటీలను గ్రేడ్‌ల వారీగా విభజించింది. స్పెషల్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీగా ఉన్న నీలగిరి 75 ఏళ్ల తరువాత కార్పొరేషన్‌గా అవతరించే అవకాశం వచ్చిందని అధికార వర్గాలు అంటున్నాయి. అయితే ఇప్పుడున్న 48 వార్డులను జనాభా ఆధారంగా మొత్తం 50 డివిజన్ల వరకు ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం.

నీలగిరి మున్సిపాలిటీ కార్పొరేషన్‌గా ఏర్పడితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులు భారీగా వచ్చే అవకాశం ఉంటుంది. పెద్ద మొత్తంలో నిధులు మంజూరైతే పట్టణ అభివృద్ధితోపాటు అన్ని వార్డులో మౌలిక సదుపాయాలు సమకూరున్నాయి. అదేవిధంగా అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏ కూడా రెండు శాతం పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

విస్తీర్ణం 200 చదరపు కిలోమీటర్లు

వార్డులు 48

జనాభా 2.50 లక్షలు

ఓటర్లు 1.50 లక్షలకుపైగా

సీఎం రేవంత్‌రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి విన్నపం

ఫ రాష్ట్రంలో కార్పొరేషన్‌కాని ఏకై క ఉమ్మడి జిల్లా కేంద్రం

ఫ 1950లోనే మున్సిపాలిటీగా ఏర్పాటు

ఫ ప్రస్తుతం స్పెషల్‌ గ్రేడ్‌గా కొనసాగింపు

ఫ త్వరలో కార్పొరేషన్‌గా అవతరణ

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేగంగా పట్టణీకరణ పెరుగుతున్న మున్సిపాలిటీల్లో నీలగిరి ముందంజలో ఉంది. గతంలో 107 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న నీలగిరి మున్సిపాలిటీ ప్రస్తుతం 200 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. పదేళ్ల క్రితం 1.65 లక్షల జనాభా ఉన్న పట్టణం ఇప్పుడు 2.50 లక్షల జనాభాకు చేరుకుంది. గడిచిన పదేళ్లలోనే దాదాపు లక్ష జనాభా పెరిగింది. ప్రస్తుతం ఆదాయం కూడా ఏటా రూ.40కోట్లకుపైగానే ఉందని అధికారులు చెబుతున్నారు. పట్టణంలో కాలనీలు, భవనాలు, గేటెడ్‌ కమ్యూనిటీ కాలనీలు, కొత్త వెంచర్లు భారీగా పెరిగాయి. డీవీకే రోడ్డు, మిర్యాలగూడ రోడ్డు, హైదరాబాద్‌ రోడ్డు ప్రాంతాల్లో భారీ సంఖ్యలో భవనాలు నిర్మించారు. ఒకప్పుడు కాలనీల్లో ఖాళీ ప్లాట్లు అధికంగా కనిపించే ఇప్పుడు భవనాలు పెరిగిపోయాయి. హైదరాబాద్‌ రోడ్డులో అన్నెపర్తి స్టేజి వరకు, దేవరకొండ రోడ్డులో కతాల్‌గూడ వరకు, మిర్యాలగూడ రోడ్డులో దుప్పలపల్లి వరకు, అద్దంకి రోడ్డులో కేశరాజుపల్లి వరకు కాలనీలు పెరిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement