పిల్లలు స్కూళ్లకు పోవడం లేదు
మోంథా తుపాను ప్రభావంతో వచ్చిన వర్షాలకు తండాకు వచ్చే రోడ్డులో ఉన్న వంతెన తెగిపోయింది. దీంతో తండాలోని పిల్లలు 15 రోజులుగా స్కూళ్లకు పోవడం లేదు. ప్రతిఏటా వానాకాలం వచ్చిందంటే వరద ఇబ్బందులు తప్పడం లేదు. ప్రస్తుతం తెగిపోయిన వంతెన వద్ద కొత్త బ్రిడ్జి నిర్మించాలి. మా తండాలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలి.
– రమావత్ పూల్య, ఊరబాయితండా
15 రోజులుగా మా తండాకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో వంతెన తెగిపోయిన ప్రదేశం నుంచి కాలినడకన ఇబ్బందులు పడుతూ రావాల్సిన పరిస్థితి. నిత్యావసర సరుకులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఎల్లిపాయ కారంతోనే అన్నం తింటున్నం. అధికారులు స్పందించి వెంటనే తండాకు రోడ్డు వేయించాలి.
– కరెంటోతు శంకర్, గాజుబెడంతండా
పిల్లలు స్కూళ్లకు పోవడం లేదు


