
సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి
మిర్యాలగూడ : రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పాలకులు కృషి చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఆదివారం మిర్యాలగూడ సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పాలకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సరైందికాదని, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజా సేవలను మరిచిపోయి తిట్ల పురాణం, ఆరోపణలు చేసుకోవడంపై ప్రజలు అసహ్యించుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు డబ్బికార్ మల్లేష్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు వీరేపల్లి వెంకటేశ్వర్లు, నాయకులు మల్లు గౌతంరెడ్డి, శశిధర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఫ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి