
ఆదాయ వేటలో.. ఆబ్కారీ!
18వ తేదీ వరకు వచ్చిన దరఖాస్తులు..
మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు 23వ తేదీ వరకు పొడిగింపు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఎకై ్సజ్ శాఖ ఆదాయ వేటలో పడింది. ఈసారి మద్యం దుకాణాల టెండర్లలో దరఖాస్తు ఫీజు ద్వారా అధిక ఆదాయం వస్తుందని భావించించింది. మద్యం దుకాణాల రెండేళ్ల కాల పరిమితికి టెండర్లు పిలిచిన ఎకై ్సజ్ శాఖ, ఆదాయం పెంచుకునేందుకు డిపాజిట్ మొత్తాన్ని పెంచింది. గతంలో ఒక్కో దరఖాస్తుకు రూ.2 లక్షలు నాన్ రీఫండబుల్ డిపాజిట్‌గా నిర్ణయించగా, కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని రూ.3 లక్షలకు పెంచింది. అధికారులంతా పెద్ద ఎత్తున ఆదాయం వస్తుందని భావించినా.. ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవడంతో గతంలో కంటే ఆదాయం తగ్గిపోయింది. దీంతో ఆదాయం పెంచుకునేందుకు టెండర్ల గడువును ఈ నెల 23వ తేదీ వరకు పొడిగించింది. అయినా ఆదాయం పెరుగుదలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
154 దుకాణాలకు టెండర్లు..
జిల్లాలో 154 మద్యం షాపులు ఉన్నాయి. వాటికి దరఖాస్తులు ఆహ్వానించగా.. సెప్టెంబర్ 26వ తేదీ నుంచి ఈ నెల 18వ తేదీ వరకు మొత్తం 4,620 దరఖాస్తులు వచ్చాయి. వాటి ద్వారా రూ. 138.60 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే 2023 సంవత్సరంలో 7,057 దరఖాస్తులు రాగా, రూ.2 లక్షల పీజుతో రూ.141.14 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే గతంలో కంటే ఈసారి ఆదాయం తగ్గిపోయింది. దీంతో ప్రభుత్వం గడువు పొడిగించింది.
దరఖాస్తులకు మూడు రోజులు అవకాశం
ఆశించిన ప్రకారం ఫీజు రూపంలో ఆదాయ రాకపోవడంతో ఎకై ్సజ్ శాఖ మద్యం షాపుల దరఖాస్తుల గడువును ఈ నెల 23వ తేదీ వరకు పొడిగించింది. 18వ తేదీ సాయంత్రంతో గడువు ముగిసినా మళ్లీ 23వ తేదీ వరకు దరఖాస్తుల గడువు పెంచింది. 19 ఆదివారం కాగా, 20వ తేదీ దీపావళి అవుతోంది. దీంతో మంగళ, బుధ, గురువాల్లో దరఖాస్తు చేసుకునేలా మళ్లీ అవకాశం ఇచ్చింది. ఈ మూడు రోజుల్లో ఏ మేరకు దరఖాస్తులు వస్తాయన్న దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.
రూ.200 కోట్లు వస్తాయని భావించినా..
ప్రభుత్వం డిపాజిట్ మొత్తాన్ని పెంచి ఆదాయం పెంచుకోవాలని చూసింది. అయితే గతంలో టెండర్లు పిలిచినప్పుడు నల్ల గొండ జిల్లాలో రూ.141.14 కోట్లు వస్తే.. ఈసారి రూ.200 కోట్ల వరకు ఆదాయం వస్తుందని జిల్లా అధికారులు అంచనా వేశారు. కానీ.. గతంలో కంటే రూ.3 కోట్లు తక్కువగానే వచ్చింది. ఈ పరిస్థితుల్లో మరో మూడు రోజులు గడువు పెంచినా.. అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేది కష్టంగానే కనిపిస్తోంది.
ఫ 2023లో రూ.2 లక్షల ఫీజుతో వచ్చిన ఆదాయం రూ.141 కోట్లు
ఫ ప్రస్తుతం రూ.3 లక్షలకు పెంచినా వచ్చింది రూ.138 కోట్లే..
ఫ రెండేళ్ల తరువాత కూడా
పెరగని ఫీజు ఆదాయం
ఫ దరఖాస్తు గడువు పొడిగించినా ఆదాయం పెరుగుదలపై
అనుమానాలు
స్టేషన్ షాపులు దరఖాస్తులు
నల్లగొండ 38 1363
నకిరేకల్ 18 480
చండూరు 14 373
మిర్యాలగూడ 26 914
హాలియా 20 474
దేవరకొండ 22 576
నాంపల్లి 16 440
మొత్తం 154 4,620