
కూటమి ప్రభుత్వానిది కక్షసాధింపు చర్య
నల్లగొండ టౌన్ : ‘ప్రజల గొంతుకగా నిలుస్తున్న సాక్షి మీడియాపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధిపు చర్యలకు పాల్పడుతోంది. రాజ్యాంగ హక్కులు, పత్రికా స్వేచ్ఛను కాలరాస్తూ కుట్రలకు పదును పెడుతోంది. నోటీసుల పేరుతో సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిని వేధిస్తోంది. నోటీసులు తీసుకుంటున్నా, పోలీసులకు సహకరిస్తున్నా వేధింపులు మాత్రం ఆగడం లేదు.’ అంటూ.. సాక్షి పత్రికపై ఏపీ ప్రభుత్వ దాడులను విద్యార్థి, యువజన సంఘాలు ఖండిస్తున్నాయి. ప్రభుత్వ తీరు మార్చుకోకపోతే ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పత్రికలు, జర్నలిస్టులకు స్వేచ్ఛ లేకుండా పోయింది. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డిపై అక్రమ కేసులన్నీ.. పత్రికల మీద జరిగిన దాడిగా పరిగణిస్తున్నాం. ఇలాంటి చర్యలతో కూటమి ప్రభుత్వం కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం.
– ఖమ్మంపాటి శంకర్,
ఎస్‌ఎఫ్‌ఐ కేంద్ర కమిటీ సభ్యుడు
సాక్షి దినపత్రిక మీద దాడులు చేయడం అప్రజాస్వామిక చర్య. ప్రజల గొంతుకగా ఉండే సాక్షిపై దాడులు చేయడం అంటే భావప్రకటన స్వేచ్ఛను హరించడమే. సాక్షి దినపత్రికపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్షగట్టి దాడులు చేయడాన్ని మా సంఘం తీవ్రంగా ఖండిస్తోంది.
– మురళీకృష్ణ, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి
సాక్షి పత్రికపై కూటమి ప్రభుత్వం పథకం ప్రకారం కుట్రలకు పాల్పడుతోంది. సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై కేసులు పెట్టడమే దీనికి నిదర్శనం. చంద్రబాబు ప్రభుత్వానికి రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం, విశ్వాసం ఉన్నా సాక్షిపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలి.
– మల్లం మహేష్, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి
సాక్షిపై దాడులు చేయడం, కేసులు బనాయించడం కూటమి ప్రభుత్వ పిరికిపంద చర్య. పత్రికలపై పదేపదే దాడులు, దౌర్జన్యాలకు దిగడం చంద్రబాబు రౌడీయిజానికి పరాకాష్ట. ప్రజల సమస్యలను తెలిపే పత్రికలకు అడ్డుకట్ట వేయాలనుకోవడం సూర్యుడి వెలుగును అడ్డుకోవాలని చూడటమే. కూటమి ప్రభుత్వం ఇప్పటికై నా సాక్షిపై దాడులు ఆపకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారు.
– ఏర్పుల శ్రవణ్ కుమార్, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు

కూటమి ప్రభుత్వానిది కక్షసాధింపు చర్య

కూటమి ప్రభుత్వానిది కక్షసాధింపు చర్య

కూటమి ప్రభుత్వానిది కక్షసాధింపు చర్య

కూటమి ప్రభుత్వానిది కక్షసాధింపు చర్య