
ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు
నల్లగొండ : ఒక్కో దీపాన్ని వెలిగిస్తూ చీకటిని తరిమేసినట్లుగానే మనుషుల్లో అజ్ఞానమనే చీకటిని తొలగిస్తూ జ్ఞాన వెలుగులు నింపే దీపాల పండుగ దీపావళి అని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. జిల్లా ప్రజలకు ఆయన దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు పటాకులు కాల్చేటప్పుడు జాగ్రత్తలు పాటిస్తూ పండుగ జరుపుకోవాలని సూచించారు. చెడుపై మంచి సాధించిన విజయం ఈ పండుగ అన్నారు.
హక్కుల సాధనకు పోరాడాలి
నల్లగొండ : ప్రభుత్వ ఉపాధ్యాయులు న్యాయపరంగా రావాల్సిన హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం (జీటీఏ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సైదుల్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం నల్లగొండలోని బోయవాడ పాఠశాలలో నిర్వహించిన సంఘం జిల్లా జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు న్యాయబద్ధంగా రావాల్సిన ఎంఈఓ, డిప్యూటీ డీఈఓ, లెక్చరర్, డైట్ ప్రిన్సిపాల్ పదోన్నతుల కోసం న్యాయస్థానంలో పోరాటానికి ఉపాధ్యాయులు కలిసి రావాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగబద్ధం కానీ ఏకీకృత సర్వీస్ రూల్స్ సాధ్యపడదని ముందు నుంచే ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం పోరాడుతోందని చెప్పారు. అనంతరం జీటీఏ జిల్లా నూతన కమిటీని ఎనుకున్నారు. అధ్యక్షుడిగా కె.సంపత్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా పతేపురం సైదయ్య, గౌర వ అధ్యక్షుడిగా బుచ్చి రాములు, కోశాధికారిగా ఆర్.వెంకట్ రమణ, అసోసియేట్ అధ్యక్షుడిగా వై.బద్రీనాథ్, వైస్ ప్రెసిడెంట్లుగా కొంపెల్లి లింగయ్య, జానయ్య ఎన్నికయ్యారు. సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాసం ప్రభాకర్, దూ దిగామ స్వామి, ధర్మానాయక్ పాల్గొన్నారు.
మూసీకి
కొనసాగుతున్న వరద
కేతేపల్లి : మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. ఆదివారం ప్రాజెక్టుకు 1,912 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా ప్రాజెక్టు ఒక క్రస్ట్ గేటును పైకెత్తి 1,104 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మూసీ కుడి, ఎడమ కాల్వలకు 293 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. సీపేజీ, లీకేజీ, ఆవిరి రూపంలో 52 క్యూసెక్కుల నీరు వృథా అవుతోంది. మూసీ ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 645 అడుగులు కాగా నీటిమట్టాన్ని 644.50 అడుగుల వద్ద నిలకడగా ఉంచి అదనంగా వచ్చిన నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని అధికారులు పేర్కున్నారు.

ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు