
నేడు నాగార్జునసాగర్‌కు ఏపీ గవర్నర్
నాగార్జునసాగర్ : ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ శనివారం నాగార్జునసాగర్‌కు రానున్నారు. రెండు రోజుల పాటు ఆయన కుటుంబసభ్యులతో కలిసి సాగర్‌లో పర్యటిస్తారు. ఉదయం 11.50 గంటలకు హెలికాప్టర్ ద్వారా ఏపీ గవర్నర్ సాగర్‌కు చేరుకుంటారు. రెండు రోజుల పాటు ఆయన సాగర్‌లోనే ఉండి వివిధ ప్రదేశాలను సందర్శించనున్నారు. ఏపీ గవర్నర్ పర్యటకు సంబంధించి ఏర్పాట్లను శుక్రవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. అనంతరం విజయవిహార్‌లో అధికారులతో సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించారు. అనంతరం బీసీగురుకుల విద్యాలయంలో ఉన్న హెలీప్యాడ్, లాంచిస్టేషన్‌ను ఆమె సందర్శించారు. కలెక్టర్ వెంట మిర్యాలగూడ సబ్‌కలెక్టర్ అమిత్ నారాయణ్, అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్, మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖరరాజు, సీఐ శ్రీనునాయక్, జిల్లా టూరిజం అధికారి శివాజీ, పెద్దవూర తహసీల్దార్ శాంతిలాల్, ఆర్‌ఐ దండ శ్రీనివాస్‌రెడ్డి, వైద్యవిధానపరిషత్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ మాతృనాయక్, డాక్టర్ రవి, సూపరింటెండెంట్ ఇంజినీర్ మల్లికార్జున్‌రావు, మున్సిపల్ కమిషనర్ వేణు, అధికారులు పాల్గొన్నారు.
ఏర్పాట్లను పరిశీలించిన నల్లగొండ కలెక్టర్