
గంజాయి విక్రయిస్తున్న యువకుల అరెస్టు
బీబీనగర్ : మండలంలోని కొండమడుగు మెట్టు వద్ద గంజాయి విక్రయిస్తున్న నలుగురు యువకులను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. బొడుప్పల్‌కు చెందిన భూక్యా ఆజాద్‌నాయక్, హయత్‌నగర్ కుంట్లూరు పరిధిలోని రావినారాయణ కాలనీకి చెందిన వల్లెపు వంశీ, మేకల స్టాలిన్, బుడ్డ సునీల్ ఛత్తీస్‌ఘడ్‌లో గంజాయి కొనుగోలు చేసి తీసుకొచ్చారు. అందులో కొంత తాము సేవించేందుకు ఉంచుకొని మిగతా దానిని విక్రయించేందుకు కొండమడుగు మెట్టు వద్దకు ఆటోలో వచ్చారు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు అనుమానాస్పదంగా ఉన్న వారిని పట్టుకొని విచారించారు. తాము గంజాయి విక్రయించేందుకు వచ్చినట్లు వారు చెప్పడంతో అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. వారి నుంచి 1.394 గ్రాముల గంజాయి, ఆటో, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. యువకులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. యువకులను పట్టుకున్న ఎస్‌ఐ రమేశ్, సిబ్బందిని సీఐ అభినందించారు.