జిల్లాకు కొత్తగా 8 మంది ఎంపీడీఓలు | - | Sakshi
Sakshi News home page

జిల్లాకు కొత్తగా 8 మంది ఎంపీడీఓలు

Oct 15 2025 6:26 AM | Updated on Oct 15 2025 6:26 AM

జిల్ల

జిల్లాకు కొత్తగా 8 మంది ఎంపీడీఓలు

నల్లగొండ : జిల్లాకు కొత్తగా ఎనిమిది మంది ఎంపీడీఓలు రానున్నారు. ఇటీవల గ్రూప్‌ –1 పరీక్ష ద్వారా ఎంపికై న వారిలో నల్లగొండ జిల్లాకు 8 మంది ఎంపీడీఓలను కేటాయించింది. అయితే వారిలో ముగ్గురు విధుల్లో చేరి తిరిగి హైదరాబాద్‌లో శిక్షణకు హాజరుకానున్నారు. మిగతా వారు ఇప్పటికే ఇతర శాఖల్లో ఉద్యోగాలు నిర్వహిస్తున్నందున శిక్షణ అనంతరం ఆ శాఖలో రిలీవై ఎంపీడీఓలుగా విధుల్లో చేరనున్నారు. వీరి రాకతో జిల్లాలో ఎంపీడీఓల కొరత తీరనుంది.

విద్యార్థుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటాం

నల్లగొండ : బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలల్లో విద్యార్థుల సంక్షేమానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం హైదరాబాద్‌ నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అనంతరం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలల సమస్యల పరిష్కారంపై ఇటీవల ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. బెస్ట్‌ అవైలబుల్‌ స్కీం కింద నిధులకు సంబంధించిన సమస్యలు ఉంటే పాఠశాలల యాజమాన్యం జిల్లా యంత్రాంగాన్ని సంప్రదించాలన్నారు. విద్యార్థులను బయటికి పంపడానికి వీల్లేదన్నారు. బెస్ట్‌ అవైలబుల్‌ స్కీం బకాయిల్లో కొంత మొత్తాన్ని వెంటనే విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం విక్రమార్క హామీ ఇచ్చారని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ నారాయణ్‌ అమిత్‌, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి చత్రునాయక్‌, మైనార్టీ సంక్షేమ అధికారి విజయేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారమే వైన్స్‌ల నిర్వహణ

నల్లగొండ : తెలంగాణ ప్రభుత్వం నిబంధనల ప్రకారమే వైన్‌ షాపులు నిర్వహించుకోవచ్చని.. ఇందులో ఎలాంటి సందేహం లేదని నల్లగొండ జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ శాఖ సూపరింటెండెంట్‌ సంతోష్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రెండేళ్ల కాలపరిమితికి వైన్‌షాపుల లైసెన్స్‌ల కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసిందని అందులో భాగంగా జిల్లాలో 154 రిటైల్‌ మద్యం దుకాణాలకు టెండర్లు ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ, గౌడ కులస్తులకు కొన్ని షాపులు రిజర్వు చేశామని.. ఆయా షాపులకు ఆ కేటగిరికి చెందిన వారు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని, మిగిలిన వాటిల్లో ఎవరైనా టెండర్‌లో పాల్గొనవచ్చని తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, మిగిలిన ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం దుకాణాలు నడపవచ్చని ప్రభుత్వ నిబంధన ఉందని.. ఆ ప్రకారమే నిర్వహించవ్చని.. దరఖాస్తుదారులు ఎలాంటి ఒత్తిళ్లు, ప్రలోబాలకు లోనుకావద్దని సూచించారు.

నక్కలగండి ప్రాజెక్టు సందర్శన

చందంపేట : చందంపేట మండలంలోని నక్కలగండి ప్రాజెక్టును మంగళవారం అటవీ శాఖ చీఫ్‌ కన్జర్వేటర్‌ శర్యణన్‌ ఆధ్వర్యంలో ఇరిగేషన్‌ శాఖ అధికారులు పరిశీలించారు. ఇక్కడి భూములను పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు. వారి వెంట డీఎఫ్‌సీ సంహిత, సీఎఫ్‌ సునీల్‌, డీఎఫ్‌ఓ రాజశేఖర్‌రెడ్డి, ఇరిగేషన్‌ ఎస్‌ఈ భద్రు, ఈఈ సత్యనారాయణ, డీఈ చక్రపాణి అధికారులు ఉన్నారు.

కపాస్‌ కిసాన్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి

మునుగోడు : పత్తి పంట సాగుచేసిన రైతులు తమ ఫోన్లలో కపాస్‌ కిసాన్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి పాల్వాయి శ్రవణ్‌కుమార్‌ సూచించారు. మంగళవారం మునుగోడు మండలంలోని పులిపలుపుల గ్రామ రైతు వేదికలో పలువురు రైతులకు 100 శాతం సబ్సిడీపై వేరుశనగ విత్తనాలు పంపీణీ చేశారు. కార్యక్రమంలో ఏడీఓ వేణుగొపాల్‌, ఏఓలు పద్మజ, మల్లేష్‌, ఏఈఓలు నర్సింహ, వహీద్‌, యాదగిరి, నిఖిల్‌, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

జిల్లాకు కొత్తగా  8 మంది ఎంపీడీఓలు1
1/1

జిల్లాకు కొత్తగా 8 మంది ఎంపీడీఓలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement