
బంద్‌కు ప్రజలంతా సహకరించాలి
నల్లగొండ టౌన్ : స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధనకు రాష్ట్ర బీసీ సంఘాల జేఏసీ పిలుపుమేరకు ఈ నెల 18న చేపట్టే బంద్‌ను విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు, దుడుకు లక్ష్మీనారాయణ అన్నారు. మంగళవారం నల్లగొండలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో వారు మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీఓ 9ని రెడ్డి జాగృతి అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. బీసీల రిజర్వేషన్లు అమలుకు మార్గం సుగమం అయిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18న బంద్ చేపట్టనున్నట్లు తెలిపారు. సమావేశంలో కంది సూర్యనారాయణ, నేలపట్ల సత్యనారాయణ, మిర్యాల యాదగిరి, కేశబోయిన శంకర్ తదితరులు పాల్గొన్నారు.