
సింథటిక్ ట్రాక్ ఏర్పాటుకు కృషి
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని ఎన్జీ కాలేజీ మైదానంలో సింథటిక్ వాకింగ్ ట్రాక్ ఏర్పాటుకు కృషి చేస్తానని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం ఎన్జీ కళాశాల మైదానంలో వాకర్స్‌తో కలిసి సింథటిక్ ట్రాక్ ఏర్పాటుపై చర్చించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఎన్జీ కళాశాల మైదానంలో క్రీడా సౌకర్యాలు కల్పించేందుకు మున్సిపాలిటీ, జిల్లా యంత్రాంగం నిధులు కేటాయిస్తామన్నారు. సింథటిక్ వాకింగ్ ట్రాక్, హైమాస్ట్ లైట్లు, ప్రస్తుతం ఉన్న ఓపెన్ జిమ్‌కు మరమ్మతు చేయించడంతోపాటు అదనంగా మరో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలి పారు. సంబందిత అధికారులు వెంటనే అంచనాలు రూపొందించి సమర్పించాలని ఆదేశించారు. ఎన్జీ కాలేజి మైదాన స్థలాన్ని ఆక్రమించుకోకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అనంతరం కలెక్టర్‌ను వాకర్స్ అసోసియేషన్ బాధ్యులు సత్కరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు జె.శ్రీనివాస్, నారాయణ్ అమిత్, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బండారు ప్రసాద్, రేపాల మదన్‌మోహన్, డాక్టర్ పుల్లారావు, ఎంవీ.గోనారెడ్డి, పసుల శౌరయ్య, ప్రిన్సిపాల్ ఉపేందర్ పాల్గొన్నారు.