
కమలానెహ్రూ ఆస్పత్రికి అంబులెన్స్
నాగార్జునసాగర్: సాగర్‌లోని కమలానెహ్రూ ఏరియా ఆసుపత్రిలో 108 అంబులెన్స్ అందుబాటులో ఉందని, హాలియా నియోజకవర్గంలోని తండాల ప్రజలు దీనిని వినియోగించుకోవాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రొగ్రాం మేనేజర్ సలీం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అధునాతనమైన టెక్నాలజీతో, మెడికల్ పరికరాలు, అత్యవసర సేవలు అందించేందుకు శిక్షణ పొందిన సిబ్బంది అంబులెన్స్‌లో ఉన్నారని పేర్కొన్నారు. కొంత మంది తండాలు, గ్రామాల ప్రజలు రోగులను ఆస్పత్రికి తీసుకొచ్చేందుకు ఆటోలు, ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారని తెలిపారు. రోగులు అత్యవసరమైనప్పుడు 108 వాహనాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఒక్క ఫోన్‌కాల్‌తో సిబ్బంది వాహనంతో వస్తారని, వారి సేవలను వినియోగించుకోవాలని కోరారు.