
22 ఏళ్లు దేశ రక్షణలో..
చిలుకూరు: చిలుకూరు మండల కేంద్రానికి చెందిన బెల్లంకొండ వేలాద్రి కుమారుడు రవి 22 ఏళ్లు దేశ రక్షణలో ఆర్మీ జవాన్‌గా సేవలందించి మంగళవారం పదవీ విరమణ పొందనున్నారు. ఆయన 2003లో డిగ్రీ మొదటి సంవత్సరంలోనే ఉండగానే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో పాల్గొని ఎంపికయ్యారు. మహరాష్ట్రలోని హేమనగర్‌లో శిక్షణ పొంది 2005లో ఆర్మీ జవాన్‌గా సైన్యంలో చేరారు. అప్పటి నుంచి జమ్మూ కశ్మీర్, పంజాబ్, హిమాచలప్రదేశ్‌లో పనిచేశారు. ఇటీవల భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌లో కూడా ఆయన పాల్గొని దేశానికి సేవలందించారు. ప్రస్తుతం అహ్మదానగర్‌లో పనిచేస్తున్న ఆయన మంగళవారం పదవీ విరమణ పొందనున్నారు.
దసరా రోజు
అభినందన సభ..
రవి పదవీ విరమణ పొంది స్వగ్రామానికి వస్తున్న సందర్బంగా అక్టోబన్ 2న దసరా రోజు చిలుకూరు మండల కేంద్రంలో ర్యాలీతో పాటు అభినందన సభ నిర్వహించేందుకు గ్రామ యువత, కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.
నేడు పదవీ విరమణ పొందనున్న చిలుకూరుకు చెందిన ఆర్మీ జవాన్