
మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ నూతన కార్యవర్గం ఎన్నిక
మిర్యాలగూడ : మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నూతన పాలకవర్గం 2025– 27 ఎన్నిక ఆదివారం పట్టణంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో జరిగాయి. ఎన్నికల అధికారిగా రిటైర్డ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పందిరి రవీందర్ వ్యవహరించారు. మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గౌరు శ్రీనివాస్, కార్యదర్శి –1గా వెంకటరమణచౌదరి(బాబి), కార్యదర్శి–2గా పొలిశెట్టి ధనుంజయలు ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. మిల్లర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో మొత్తం 90 ఓటర్లు కాగా ఉపాధ్యక్ష పదవి కోసం మాశెట్టి శ్రీనివాస్, గోళ్ల రామశేఖర్ పోటీపడగా మాశెట్టి శ్రీనివాస్‌కు 15ఓట్లు, రామశేఖర్‌కు 69ఓట్లు వచ్చాయి. దీంతో రామశేఖర్ విజయం సాధించారు. కోశాధికారి పదవికి చిల్లంచర్ల శ్రీనివాస్, గందె రాము పోటీ పడగా శ్రీనివాస్‌కు 42ఓట్లు, రాముకు 44ఓట్లు వచ్చాయి. దీంతో రాము విజయం సాధించారు. పది డైరక్టర్ల పదవులకు 30 నామినేషన్లు రాగా డ్రా పద్ధతిలో పది మందిని ఎంపిక చేశారు. డైరెక్టర్లుగా గౌరు శంకర్, నీలా పాపారావు, పోతుగంటి గోపి, ఆతుకూరి గురునాథం, గుర్రం వెంకటరత్నం, శ్రీరంగం నర్సయ్య ఎన్నికయ్యారని ఎన్నికల అధికారి రవీందర్ ప్రకటించారు. నూతన పాలకవర్గాన్ని పలువురు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కర్నాటి రమేష్, గుడిపాటి శ్రీనివాస్, మాజీ అధ్యక్షుడు చిల్లంచర్ల విజయ్‌కుమార్, మంచుకొండ వెంకటేశ్వర్లు, మున్సిపల్ మాజీ చైర్మన్ తిరునగరు భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.
ఫ అధ్యక్షుడిగా గౌరు శ్రీనివాస్,
కార్యదర్శిగా వెంకటరమణచౌదరి
ఏకగ్రీవం
ఫ మిగతా స్థానాలకు ఎన్నికలు

మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ నూతన కార్యవర్గం ఎన్నిక

మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ నూతన కార్యవర్గం ఎన్నిక