
బస్టాండ్‌కు మరమ్మతు చేయాలి
మిర్యాలగూడ : ఆర్టీసీ బస్టాండ్‌కు మరమ్మతు చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం మిర్యాలగూడలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఆయన బస్టాండ్‌ను తనిఖీ చేశారు. బస్టాండ్‌లో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న మరమ్మతు పనులను సత్వరమే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఫోన్ ద్వారా ఆదేశించారు. బస్టాండ్‌లో పెచ్చులు ఊడిన చోట త్వరితగతిన మరమ్మతు పనులు చేయాలన్నారు. ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు ఎమ్మెల్యే కాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పట్టణంలో గౌడ సంఘం భవనానికి రూ.50 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్‌నాయక్, ఉదయ్‌భాస్కర్‌గౌడ్, చౌగాని వెంకన్నగౌడ్, గురుమూర్తి, పెద్ది శ్రీనివాస్‌గౌడ్, జెర్రిపోతుల రాములుగౌడ్, ఆర్టీసీ అధికారులు ఉన్నారు.
ఫ రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ
మంత్రి పొన్నం ప్రభాకర్