
హామీలను గాలికొదిలేసిన కాంగ్రెస్
తిప్పర్తి : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇప్పుడు గాలికొదిలేసిందని మాజీమంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలపై బీఆర్‌ఎస్ పార్టీ తీసుకొచ్చిన కాంగ్రెస్ బాకీ కార్డులను ఆదివారం తిప్పర్తి మండలం కేంద్రంలో ఇంటింటికి పంచారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ కర్నాటక ప్రభుత్వం అల్మట్టి డ్యాం ఎత్తు పెంచాలని చూస్తోందని.. దానివల్ల నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాలు ఎడారిగా మారతాయన్నారు. ఆ విషయంపై ఇక్కడ ఉన్న అధికార పార్టీకి సోయిలేదని.. బీఆర్‌ఎస్ పార్టీ తరఫున నల్లగొండ జిల్లా రైతులతో కలిసి చలో అల్మట్టి కార్యక్రమం చేపడతామని తెలిపారు. ఇరిగేషన్ మంత్రికి ఆల్మట్టిపై సోయిలేదని.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి నీళ్ల గురించి అవగాహన లేదని విమర్శించారు. అధికారం కోసం అడ్డగోలు హామీలిచ్చి అమలు చేయడంలో విఫలమయ్యారని.. కాంగ్రెస్ మోసాన్ని ఎండగడుతూ కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ కార్యక్రమం చేపట్టామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిషోర్‌కుమార్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ తండు సైదులుగౌడ్, నాయకులు కందుల లక్ష్మయ్య, వనపర్తి నాగేశ్వర్‌రావు, లొడంగి గోవర్ధన్, సిరసవాడ సైదులు, బైరగోని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఫ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి
ఫ తిప్పర్తిలో ఇంటింటికీ
కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ