
చికిత్స పొందుతూ మృతి
మోత్కూరు: రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆరెగూడెం గ్రామానికి చెందిన చేకూరి మల్లేషం భార్య విజయనిర్మల అలియాస్ మమత(48) ప్రైవేట్ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం హైదరాబాద్ నుంచి కారులో ఆరెగూడెం వస్తుండగా.. భువనగిరి మండలం కుమ్మరిగూడెం సమీపంలోకి రాగానే కారు అదుపుతప్పి రోడ్డు పక్కన చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన మమతను కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతిచెందింది. మృతురాలికి భర్త, కుమార్తె, కుమారుడు ఉన్నారు.