
18 గేట్ల ద్వారా ‘పులిచింతల’ నీటి విడుదల
మేళ్లచెరువు : ఎగువన ఉన్న నాగార్జున సాగర్‌తోపాటు మూసీ ప్రాజెక్టులు, టెయిల్‌పాండ్ గేట్లు ఎత్తడంతో చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టుకు వరదనీరు భారీగా వచ్చిచేరుతుంది. ఆదివారం రాత్రి వరకు 6,00,685 క్యూసెక్కుల వరద రాగా ప్రాజెక్టు నీటిమట్టం పూర్తిస్థాయికి చేరినట్లు అధికారులు తెలిపారు. దీంతో 18 గేట్లను 4 నుంచి 5 మీటర్ల మేర పైకెత్తి అవుట్‌ఫ్లోగా 6,08,541 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. టీజీ జెన్‌కో 16,600 క్యూసెక్కుల నీటిని ఉపయోగిస్తూ 4 యూనిట్ల ద్వారా 105 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు పేర్కొన్నారు.