
భూ వివాదంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ
పెద్దవూర: భూ వివాదంలో ఇరువర్గాల మధ్య ఘర్షణలో వృద్ధ దంపతులకు గాయాలయ్యాయి. ఈ ఘటన ఆదివారం పెద్దవూర మండలం తుంగతూర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని రామన్నగూడెంలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. రామన్నగూడెం గ్రామానికి చెందిన నక్క రాములు, అతడి సోదరికి మధ్య కొంతకాలంగా భూ వివాదాలు కొనసాగుతున్నాయి. ఆదివారం ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో రామయ్య సోదరి కుమారులైన రామలింగయ్య, శంకరయ్య రామయ్యతో పాటు అతడి భార్య లక్ష్మిపై దాడి చేశారు. దీంతో వారిద్దరి చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. గాయపడిన వృద్ధ దంపతులను చికిత్స నిమిత్తం నాగార్జునసాగర్‌లోని కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని పెద్దవూర పోలీసులు పేర్కొన్నారు.
గాయపడిన రామయ్య, లక్ష్మి
వృద్ధ దంపతులకు గాయాలు

భూ వివాదంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ