
నేడు మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఎన్నికలు
మిర్యాలగూడ : మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఎన్నికలు ఆదివారం జరగనున్నాయి. ప్రతి రెండేండ్లకోసారి సెప్టెంబర్ చివరి ఆదివారం పాలకవర్గానికి ఎన్నిక నిర్వహించి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటారు. 2025–27 నూతన కార్యవర్గ ఎన్నికల్లో 90 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి –1, 2, కోశాధికారి పదవులకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఆదివారం ఉదయం 10గంటలకు మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో ఎన్నికల ప్రక్రియ జరగనుంది. ఎన్నికల అధికారిగా కేఎన్‌ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ పందిరి రవీందర్ వ్యవహరించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల నామినేషన్ల ప్రక్రియ, మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. 3గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తారు. ఏ స్థానానికి ఎవరెవరు పోటీ చేస్తారో అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.
మహిళలంతా సంఘాల్లో చేరాలి
నకిరేకల్ : మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నందురు వారంతా స్వయం సహాయక సంఘాల్లో చేరాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వై.శేఖర్‌రెడ్డి సూచించారు. నకిరేకల్ మండలం మంగళపల్లి గ్రామంలోని నర్సరీని శనివారం ఆయన సందర్శించారు. నర్సరీ నిర్వహణ బాగుండడంతో ఫీల్డ్ అసిస్టెంట్ రమాదేవి, వన సేవక్ రాజేష్‌ను సన్మానించారు. ఆయన వెంట ఏపీడీ లక్ష్మీ నర్సింహ, ఏపీఓ రమణయ్య, టీఏలు స్వాతి, రమణ, యాదగిరి, రాధా, కృష్ణ ఉన్నారు.
మదర్ డెయిరీ డైరెక్టర్‌గా మూడోసారి..
చిట్యాల : మదర్ డెయిరీ డైరెక్టర్‌గా చిట్యాల మండలం వనిపాకల గ్రామానికి చెందిన కర్నాటి జయశ్రీ మూడోసారి విజయం సాధించారు. రంగారెడ్డి జిల్లా హయాత్‌నగర్‌లోని మదర్ డెయిరీ కార్యాలయంలో జరిగిన ఎన్నికల్లో మహిళ కోటా స్థానానికి ఆమె డైరెక్టర్‌గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాడి రైతుల సంక్షేమానికి కృషి చేస్తానన్నారు. తన ఎన్నికకు సహకరించిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, సొసైటీ అధ్యక్షులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
లలితా త్రిపుర సుందరీదేవిగా అమ్మవారు
కనగల్ : మండలంలోని ధర్వేశిపురం స్టేజీ వద్ద గల శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం అమ్మవారిని లలితా త్రిపుర సుందరీదేవిగా అలంకరించి అర్చకులు పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ చీదేటి వెంకట్‌రెడ్డి, ఈఓ అంబటి నాగిరెడ్డి, సిబ్బంది చంద్రయ్య, నాగేశ్వరరావు, ఉపేందర్‌రెడ్డి, అర్చకులు నాగోజు మల్లాచారి, చిలకమర్రి శ్రవణ్ కుమారాచార్యులు పాల్గొన్నారు.

నేడు మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఎన్నికలు

నేడు మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఎన్నికలు