
భూభారతి అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దు
నల్లగొండ: రెవెన్యూ సదస్సులు, భూభారతిలో వచ్చిన అర్జీల పరిష్కారంలో జాప్యం చేయొద్దని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం నల్లగొండ కలెక్టరేట్‌లో రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. అక్టోబర్ 4న రెవెన్యూ శాఖ మంత్రి జిల్లా పర్యటనకు వచ్చే అవకాశం ఉన్నందున రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం అసైన్డ్, వక్ఫ్, ఎండోమెంట్స్ భూములు తదితర అంశాలపై ఆమె సమీక్షించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, ఆర్టీఓలు అశోక్‌రెడ్డి, రమణారెడ్డి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి